Canada, June 12: కెనడాకు చెందిన పాప్ సింగర్ జస్టిన్ బీబర్ (Justin Bieber) అతి చిన్నవయసులోనే రాక్ స్టార్‌గా మారి ప్రపంవచ్యాప్తంగా తనకంటూ కోట్లలో అభిమానులను సంపాదించుకున్నాడు. జస్టిన్ (Justin Bieber)పాట వస్తుందంటే యావత్ యూత్ దాని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. అయితే గతంలో కరోనా బారిన పడిన జస్టిన్, ఆ తరువాత కోలుకున్నట్లుగా ప్రకటించాడు. కానీ.. కరోనా మహమ్మారి కారణంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడ్డాడు జస్టిన్. ప్రస్తుతం ఆయన ఫేషియల్ పరాలిస్‌తో (paralysed) బాధపడుతున్నట్లు తాజాగా వెల్లడించాడు. కరోనా (Corona) నుండి కోలుకున్నాక, తాను ముఖ పక్షవాతంతో బాధపడుతున్నట్లుగా పేర్కొన్నాడు.

దీనికి ముఖ్యమైన కారణం ‘రామ్సే హంట్ సిండ్రోమ్’ అని జస్టిన్ తెలిపాడు. ఈ వ్యాధి వల్ల తన ముఖంలోని కుడివైపు భాగం పూర్తిగా చచ్చుబడిపోయింది. అయితే తాను ఎదుర్కొంటున్న ఈ సమస్యను తన అభిమానులకు వివరించేందుకు ఓ వీడియో తీసి తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు ఈ పాప్ సింగర్. 

Pervez Musharraf on Ventilator: విష‌మించిన ప‌ర్వేజ్ ముషార్ర‌ఫ్ ఆరోగ్యం, వెంటిలేట‌ర్‌పై పాక్ మాజీ అధ్య‌క్షుడు, సోషల్ మీడియాలో కలకలం రేపుతున్న డెత్ వార్తలు 

తన కన్ను (Eye) ఒకటి కొట్టుకోవడం లేదని.. తన ముఖంలో ఒక వైపు నుంచి నవ్వలేకపోతున్నానని.. తన ముఖంలో ఒక వైపు పూర్తిగా పక్షవాతానికి గురైందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ ఫేషియల్ పక్షవాతం కారణంగా ఆయన తన టూర్స్, ఈవెంట్స్‌ను రద్దు చేసుకున్నట్లుగా వెల్లడించాడు. ఇలా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న జస్టిన్ బీబర్ హెల్త్ పట్ల ఎప్పుడూ జాగ్రత్తగా ఉండేవాడని వారు అంటున్నారు.

Viral: వీడు మనిషేనా.. మహిళను రైల్వే ట్రాక్ పైకి తోసేశాడు, ట్రైన్ రాకపోవడంతో తప్పిన పెను ప్రమాదం, న్యూయార్క్‌లో దారుణ ఘటన  

అయితే రామ్సే హంట్ సిండ్రోమ్ అనేది ఒక అరుదైన నాడీ సంబంధిత వ్యాధి. దీని కారణంగా ముఖ నరాలు పక్షవాతానికి గురవ్వుతాయి. సాధారణంగా చెవి లేదా నోటిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. తమ అభిమాన గాయకుడు ఈ ముఖ పక్షవాతం నుండి వీలైనంత త్వరగా కోరుకోవాలని ఆయన అభిమానులు భగవంతుడిని ప్రార్ధిస్తున్నారు.