Kim Jong Un Apologises: కిమ్ నోటి వెంట సారీ మాట, ఉద్యోగిని కాల్చివేసిన ఘటనలో దక్షిణకొరియాకు సారీ చెప్పిన ఉత్తర కొరియా అధ్యక్షుడు
North Korea's ruler Kim Jong-Un (Photo Credit: File/PTI)

Seoul, September 25: దక్షిణ కొరియా ఉద్యోగి ఒకరిని ఉత్తర కొరియా దళాలు కాల్చి చంపి, మృతదేహాన్ని తగలబెట్టిన విషయం విదితమే. ఆ వ్యక్తిని ఇరుదేశాల మధ్య వివాదాస్పద సరిహద్దులోని జలాల్లో ఒక చిన్న తెప్పలాంటి దానిపై ప్రయాణిస్తుండగా, గుర్తించి అదుపులోకి తీసుకుని చంపేశాయని (Killing of South Korean Official) నార్త్ కొరియా గురువారం వెల్లడించింది. దీంతో రెండు దేశాల మధ్య మళ్లీ వివాదం మరింతగా ముదిరే సూచనలు కనిపించడంతో ఉత్తర కొరియా అధ్యక్షుడు రంగంలోకి దిగారు.

ఉభయ కొరియాల మధ్య ఉద్రిక్తతలను చల్లబరిచే విధంగా ఘటనపై కిమ్ క్షమాపణలు (Kim Jong Un Apologises) కోరారు. ఈ అనుకోని దురదృష్టకర సంఘటనకు (Calls Incident 'Unfortunate') ఆయన ఎంతో విచారం వ్యక్తం చేశారని దక్షిణ కొరియా అధికారులు ప్రకటించారు. ఇలా ఉత్తరకొరియా అధ్యక్షుడు క్షమాపణ చెప్పడం అత్యంత అరుదైన పరిణామమని విశ్లేషకులు అంటున్నారు. ఉత్తరకొరియా పట్ల దక్షిణ కొరియాలో (South Korea) పెరుగుతున్న వ్యతిరేకతను చల్లబరిచేందుకు, ఈ ఘటనపై దక్షిణ కొరియా అధ్యక్షుడిపై పెరుగుతున్న విమర్శలు తగ్గించేందుకు కిమ్‌ క్షమాపణ కోరి ఉంటారని విశ్లేషిస్తున్నారు. సముద్రతీరంలో దక్షిణ కొరియా పౌరుడిని కాల్చిచంపడం పట్ల.. ఇది ఊహించని విషాద ఘటనని సియోల్‌ అధ్యక్ష కార్యాలయం పేర్కొంది.

కరోనా మరణాలు తీవ్రంగా పెరిగే అవకాశం, ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్‌ఓ, ప్రపంచదేశాలు సమిష్టి చర్యలు తీసుకోకపోతే మరణాలు 20 లక్షలకు చేరే అవకాశం ఉందని తెలిపిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

దక్షిణ కొరియా ఫిషరీస్‌ అధికారిని మంగళవారం ఉత్తర కొరియా సైనికులు కాల్చిచంపారు. కరోనా వైరస్‌ ఇన్ఫెక్షన్‌ పట్ల జాగ్రత్తల కారణంగా అధికారి మృతదేహం ఇంకా సముద్ర జలాల్లోనే ఉందని ఉత్తర కొరియా పేర్కొంది.కరోనా వైరస్‌తో దక్షిణ కొరియా సమస్యల్లో కూరుకుపోయిన క్రమంలో సాయం చేయాల్సిన తరుణంలో అధ్యక్షుడు మూన్‌, దక్షిణ కొరియన్లను నిరాశపరిచినందుకు కిమ్‌ క్షమాపణలు చెప్పారని దక్షిణ కొరియా జాతీయ భద్రతా సలహాదారు సు హున్‌ పేర్కొన్నారు

కోమాలేదు..గీమాలేదు, మీటింగ్‌లో దర్జాగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్, సంచలన ఫోటోలను విడుదల చేసిన నార్త్ కొరియా వార్తా సంస్థ కెసిఎన్ఎ, నిజమా..కాదా అనే సందిగ్ధంలో నెటిజన్లు

ఇదిలా ఉంటే కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే లక్ష్యంతో అక్రమంగా సరిహద్దులు దాటేవారిని కనిపిస్తే కాల్చివేయాలని ఉత్తర కొరియా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. తమ దేశంలో కరోనా ఇంకా అడుగుపెట్టలేదని ఉత్తర కొరియా చెబుతోంది. నార్త్‌ కొరియా దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, బాధ్యులను శిక్షించాలని ఆ దేశాన్ని డిమాండ్‌ చేస్తున్నామని దక్షిణ కొరియా సీనియర్‌ మిలటరీ అధికారి ఆన్‌ యంగ్‌ హో పేర్కొన్నారు.