Uganda, July 23: భార్యకు విడాకులిచ్చేందుకో, లేకపోతే వదిలేసేందుకో చాలా మంది అనేక కారణాలు చెప్తుంటారు. కట్నం సరిపోలేదనో, పిల్లలు పుట్టలేదనో, అనుమానంతోనే భార్యను వదిలేస్తుంటారు. మరికొందరైతే ప్రవర్తన సరిగా లేదని, వంట చేయడం లేదని సిల్లీ రీజన్స్ కూడా చెప్తారు. అయితే భార్యకు ట్విన్స్ (Twins) పుట్టారని వదిలేసి వెళ్లిపోయాడు ఉగాండకు (Uganda) చెందిన ఓ వ్యక్తి. ఏకంగా ఐదు సార్లు కవలలకు జన్మనిచ్చిందనే కారణంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. దాంతో ఆ మహిళ పది మంది పిల్లలతో భర్త కోసం ఎదురుచూస్తోంది. తన తప్పేమి లేకపోయినా పిల్లలతో నానా యానతపడుతోందా మహిళ. ఆఫ్రికాలోని ఉగాండా దేశంలో నాలోంగో గ్లోరియా (Nalongo Gloria) అనే మహిళకు వరుసగా ఐదుసార్లు కవలలు పుట్టారు. అలా గ్లోరియా (Nalongo Gloria) ఇప్పటికే 10 మంది పిల్లలకు తల్లి అయ్యింది. ఐదవ కాన్పులో పుట్టిన పిల్లలతో కలిపి మొత్తం 10మంది పిల్లలు పుట్టేసరికి గ్లోరియా భర్త ఇంతమంది పిల్లల్ని పెంచలేను అని బెంబేలెత్తిపోయి భార్యాపిల్లల్ని వదిలేసి ఎక్కడికో పోయాడు.

Incredibly Bad luck: దురదృష్టమంటే ఇతనిదే! ఒకేసారి ప సోకిన కరోనా, మంకీపాక్స్, కాలిఫోర్నియాలో ఒకే వ్యక్తికి రెండు రోగాలు, 2 వారాలపాటూ మంచానికే పరిమితమమైన వ్యక్తి 

భర్త ఇంటిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్లిపోయాడో (Abandons Wife) ఆ మహిళకు ఇంతవరకూ తెలియదు. దీంతో పిల్లలను పెంచే భారం ఆమెపై పడింది. ఇటువంటి దుస్థితిలో గ్లోరియా మీడియాతో మాట్లాడుతూ తాను మూడవసారి గర్భవతిని అయి కవలలకు జన్మనిచ్చినప్పుడు.. ఇదే చాలా ఎక్కువ.. ఇంటి నుంచి వెళ్లిపొమ్మన్నాడని..కానీ ఆ తరువాత బాగానే ఉన్నాడని ఇప్పుడు ఐదవసారి కూడా కవలలు పుట్టేసరికి నా భర్త ఎక్కడికి వెళ్లిపోయాడో తనకేమీ తెలియదని గ్లోరియా ఆవేదనతో తెలిపింది.

Ranil Wickremesinghe: శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే, గొటబాయ రాజపక్స స్థానంలో కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక 

ఈ పరిస్థితిపై గ్లోరియా బాధపడుతోంది. ఇకపై అంతా దేముడిదే భారమని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఇంత మంది పిల్లలకు జన్మనివ్వడంపై తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని గ్లోరియా స్పష్టం చేసింది. ఇటువంటి పరిస్థితిలో గ్లోరియా తన పిల్లలతో పాటు ఉంటున్న ఇంటిని ఖాళీ చేయాలని ఇంటి యజమాని చెప్పటంతో గోరు చుట్టుమీద రోకటిపోటులా ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితితో తల్లడిల్లిపోతోంది గ్లోరియా.