Image used for representational purpose | (Photo Credits: ANI)

Taiwan November 27: ఎమర్జెన్సీ కోసం వాడే అంబులెన్స్(Ambulance) సర్వీసులను…ఆకతాయి పనుల కోసం వాడుకున్నాడు ఓ వ్యక్తి. ఒక్కటి, కాదు రెండు కారు ఇలా ఏకంగా 39 సార్లు అంబులెన్స్ కు కాల్ చేసి అందులో సూపర్ మార్కెట్‌కు (Super Market) వెళ్లాడు. అలా ఎందుకు చేశావ్ అని ప్రశ్నిస్తే…అతను చెప్పిన సమాధానం విని దిమ్మతిరిగిపోయింది. నడవడం బద్దకం(Lazy) అయి అలా చేశానని తీరిగ్గా సమాధానమిచ్చాడు. దాంతో పోలీసులకు అప్పగించారు ఆస్పత్రి సిబ్బంది.

తైవాన్‌కు(Taiwan) చెందిన ఓ వ్యక్తి స‌రుకుల కోసం సూప‌ర్ మార్కెట్‌కు(Super Market) వెళ్లిన‌ప్పుడు.. ట్యాక్సీ(Taxi) బుక్ చేసుకొని వెళ్లడం ఎందుకు డ‌బ్బులు దండ‌గ అని అనుకున్నాడో ఏమో.. వెంట‌నే అంబులెన్స్‌కు ఫోన్ చేసి త‌న‌కు అస్వస్థత‌గా ఉంద‌ని చెప్పి.. దాంట్లో ఫ్రీ(Free Service)గా ప్రయాణం చేసేవాడు. త‌ను చెప్పిన ఆసుప‌త్రికి తీసుకెళ్లాల‌ని అంబులెన్స్ సిబ్బందిని కోరేవాడు. ఎందుకంటే.. త‌ను చెప్పిన ఆసుప‌త్రి ప‌క్కనే అత‌డి ఇల్లు కాబట్టి. అలా అంబులెన్స్ ఆసుప‌త్రిలో(Hospital) అత‌డిని దింప‌గానే అక్కడి నుంచి త‌న ఇంటికి వెళ్లిపోయేవాడు.

Matrimonial Cheating: డాక్టర్లను, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను కోరుకుంటున్న అమ్మాయిలు, ఇదే ఆసరాగా చేసుకొని చెలరేగిపోతున్న ఆన్‌లైన్ మోసగాళ్లు, వారం రోజుల వ్యవధిలో వెలుగులోకి వచ్చిన రెండు ఘటనలు

మీకు ఇంకో విష‌యం ఏంటంటే? సూప‌ర్ మార్కెట్ నుంచి త‌న ఇంటికి మ‌ధ్య దూరం ఎంతో తెలుసా? కేవ‌లం 200 మీట‌ర్లు అంటే క‌నీసం అర కిలోమీట‌ర్ కూడా కాదు. అయిన‌ప్పటికీ.. ఫ్రీ ట్యాక్సీలా అంబులెన్స్‌ను 39 సార్లు వాడుకున్నాడు.

చాలాసార్లు అంబులెన్స్‌లో వ‌చ్చి చెక‌ప్ చేయించుకోకుండా వెళ్లిపోతున్న అత‌డిపై హాస్పిట‌ల్ సిబ్బందికి అనుమానం క‌లిగింది. దీంతో వెంట‌నే పోలీసుల‌కు(Police) స‌మాచారం అందించ‌డంతో అత‌డి అస‌లు గుట్టును బ‌య‌ట‌పెట్టారు. అత‌డికి వార్నింగ్ ఇచ్చి వ‌దిలేశారు. ఇంకోసారి అలా చేస్తే జైలులో ఊచ‌లు లెక్కబెట్టాల్సి వ‌స్తుందని హెచ్చరించారు.