Newdelhi, July 6: ఇరాన్ (Iran) లో శుక్రవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల పోలింగ్ (Iran presidential election polling) లో సంస్కరణవాది మసౌద్ పెజెష్కియాన్ (Masoud Pezeshkian) గెలిచారు. 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించిన ఆయన ఇరాన్ తదుపరి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్న ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) ఈ ఏడాది మే నెల 19న హెలిక్యాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు అక్కడ ఎన్నికలు నిర్వహించారు.
BREAKING: Masoud Pezeshkian wins presidential election in Iran
— BNO News (@BNONews) July 6, 2024
అప్పుడు కుదరలే..
ఇప్పటికే జూన్ మూడో వారంలో ఇరాన్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరిగింది. అయితే ఆ ఎన్నికల్లో ఏ అభ్యర్థికీ 50 శాతం ఓట్లు రాకపోవడంతో మరోసారి పోలింగ్ నిర్వహించారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం.. మొత్తం పోలైన ఓట్లలో 50 శాతం ఓట్లు సాధించిన అభ్యర్థినే అధ్యక్షుడిగా నియమిస్తారు.