Mexico Truck Crash:ఘోర విషాదం.. 49 మంది ప్రాణాలను బలిగొన్న రోడ్డు ప్రమాదం, మృతులంగా వలస కూలీలే, మరో 58 మందికి తీవ్ర గాయాలు, మెక్సికోలో చియాపాస్ రాష్ట్రంలో ఘటన
Road accident (image use for representational)

Tuxtla Gutierrez, Dec 10: మెక్సికోలో (Mexico) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో (Mexico Truck Crash) 49 మంది వలస కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 58 మందికి (58 Injured) తీవ్ర‌గాయాల‌య్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ విషాద ఘటనలో మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. మెక్సికోలోని దక్షిణాది రాష్ట్రమైన చియాపాస్ రాష్ట్రంలోని ట‌క్స్‌లా గుటియెర్రెజ్ లో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

మెక్సికో నుంచి వ‌ల‌స కూలీలు అమెరికా స‌రిహ‌ద్దుల వైపున‌కు వెళ్తున్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది.వలసదారులతో వెళ్తున్న ట్రక్కు రిటైనింగ్‌ గోడను ఢీకొట్టింది.ట్ర‌క్కులో ప‌రిమితికి మించి బ‌రువు ఉండ‌డం, దాన్ని డ్రైవ‌ర్ వేగంగా న‌డ‌ప‌డం వ‌ల్లే అది ఒక్క‌సారిగా బోల్తా ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌మాద స‌మ‌యంలో ట్ర‌క్కులో చిన్నారులు కూడా ఉన్నారు. గాయాల‌పాలైన వారిని స‌హాయ‌క బృందాలు ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించి, చికిత్స అందేలా చేస్తున్నాయి. మెక్సికో నుంచి అమెరికాకు చ‌ట్ట విరుద్ధంగా వ‌ల‌స‌లు వెళ్లే క్ర‌మంలో కార్మికులు ప‌దే ప‌దే ప్ర‌మాదాల‌కు గురవుతున్నారు.

Here's Mexico Truck Crash Video

వారంతా వలసకార్మికులని, సరైన ధృవపత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాకు వెళ్తున్నారని స్థానిక ప్రాసిక్యూటర్ కార్యాలయం ప్రకటించింది. వారంతా ఏదేశానికి చెందినవారనే విషయం ఇంకా తెలియరాలేదన్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర గవర్నర్ రుటిలియో ఎస్కాండన్ సంతాపం తెలిపారు. ఈ ప్రమాదానికి కారణం ఎవరనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.