Myanmar Air Strike (Photo-ANI)

మయన్మార్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తుండటంతో వారిని అణిచివేసేందుకు సైన్యం వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో దాదాపు 80 మంది మరణించినట్లుగా వార్తలు వస్తున్నాయి. కచిన్‌ రాష్ట్రంలో జరుపుకుంటున్న వేడుకలపై సైన్యం విరుచుకుపడటంతో మారణకాండ చోటుచేసుకున్నది.మూడు జెట్‌ ఫైటర్లతో సైన్యం నాలుగు బాంబులు జారవిడిచింది. ఆంగ్‌సాన్‌ సూకీ నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకున్న అనంతరం సైన్యం జరిపిన దాడుల్లో ఇది అతి పెద్దదిగా చెప్పవచ్చు.

ప్రధాని హోదాలో రిషి సునక్ తొలి ప్రసంగం, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న బ్రిటన్‌ను గట్టెక్కించేందుకు కఠిన నిర్ణయాలు తప్పవని సందేశం

ఆర్మీ సైనిక శిక్షణ కోసం ఉపయోగించే హపకాంత్‌ టౌన్‌షిప్‌లోని ఆంగ్‌ బార్లే గ్రామానికి సమీపంలో దాడులు జరిగాయి.కచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ 9వ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగినట్లు మిలటరీ ప్రభుత్వ సమాచార కార్యాలయం సోమవారం అర్థరాత్రి ఒక ప్రకటనలో ధ్రువీకరించింది. కాగా మరో మూడు రోజుల్లో మయన్మార్‌లో విస్తృతంగా జరుగుతున్న హింసాకాండపై చర్చించేందుకు ఆగ్నేయాసియా దేశాల విదేశాంగ మంత్రులు ఇండోనేషియాలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.