Delta Covid-19 Variant Representative Image

Cyprus, Jan 10: కరోనా వేరియంట్ ఒమిక్రాన్ దెబ్బకు ఇప్పటికే ప్రపంచం మొత్తం అల్లాడిపోతోంది. మరోవైపు కరోనాలో మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. సైప్రస్ లో ఈ వేరియంట్ (Deltacron detected in Cyprus) బయటపడింది. దీనికి డెల్టాక్రాన్ అని పేరు పెట్టారు. అయితే ఈ కొత్త రకం వేరియంట్ (New Covid variant called Deltacron) గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెపుతున్నారు. ఈ వేరియంట్ ను సైప్రస్ యూనివర్శిటీ వైరాలజీ నిపుణుడు డాక్టర్ లియోండియోస్ కోస్టిక్రిస్ గుర్తించారు. మరోవైపు డెల్టాక్రాన్ వేరియంట్ గురించి సైంటిస్టులు మాట్లాడుతూ... దీని ప్రభావం ఎంతమేర ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. ఇప్పటికే దీని బారీన 25 మంది (25 cases so far) పడ్డారు.

ఇది డెల్టా, ఒమిక్రాన్ జన్యువుల కలయికతో ఏర్పడిందని చెప్తున్నారు. హాస్పిటల్‌లో చేరిన బాధితుల నమూనాల్లో మ్యూటేషన్ల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్తున్నారు నిపుణులు. ఈ కొత్త వేరియంట్‌ వల్ల హాస్పిటల్‌లో చేరికలు పెరుగుతాయని ఖచ్చితంగా చెప్పలేమన్నారు. దీని మ్యూటేషన్ల స్థాయి ఎక్కువగా ఉందని ఈ వేరియంట్‌ను కనుగొన్న సైప్రస్‌ యూనివర్శిటీ వైరాలజీ నిపుణుడు లియోండస్‌ కోస్టిక్రిస్‌ తెలిపారు.

దేశంలో కొత్తగా 1,79,723 మందికి కరోనా, నిన్న క‌రోనా వ‌ల్ల‌ 146 మంది మృతి, ఇప్ప‌టివ‌ర‌కు 69,15,75,352 క‌రోనా ప‌రీక్ష‌లు

సిగ్మా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, కోస్ట్రికిస్ ఇలా అన్నాడు: “ప్రస్తుతం ఓమిక్రాన్ మరియు డెల్టా కో-ఇన్‌ఫెక్షన్‌లు ఉన్నాయి ఈ రెండింటి కలయికతో ఈ జాతిని మేము కనుగొన్నాము. డెల్టా జన్యువులలో ఓమిక్రాన్ లాంటి జన్యు సంతకాలను గుర్తించడం వల్ల ఈ ఆవిష్కరణకు డెల్టాక్రాన్ అని పేరు పెట్టారు. డెల్టా జన్యువులలో Omicron-వంటి జన్యు సంతకాలను కలిగి ఉన్న తాజా SARS-CoV-2 వేరియంట్ తీవ్రమైన ముప్పును కలిగి ఉండకపోవచ్చు. వివిధ మీడియా నివేదికల ప్రకారం, నిపుణులు ఇది ఇంకా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విశ్వసిస్తున్నారు, ప్రత్యేకించి పరిశోధకులు ఇది మరింత వ్యాధికారకమైనదా లేదా అంటువ్యాధి కాదా లేదా అది ప్రబలంగా ఉంటుందా అనే విషయాన్ని ఇంకా కనుగొనలేకపోయారు. అయితే డెల్టాక్రాన్ అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) జాతికి ఇచ్చిన అధికారిక పేరు కాదు. ఇది అధికారికంగా గుర్తించబడిన వేరియంట్ కూడా కాదు.