
Wellington, May 31: న్యూజిలాండ్ ను భారీ వర్షాలు ముంచెత్తాయి. కాంటర్బరీ ప్రాంతంలో విస్తృతంగా వరదలు (New Zealand Floods) రావడంతో వందల మందిని సోమవారం వారి ఇళ్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొన్ని ప్రదేశాలలో వారాంతంలో మరియు సోమవారం వరకు 40 సెంటీమీటర్ల (16 అంగుళాల) వర్షం కురిసిన తరువాత అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పరిస్థితులు మెరుగుపడకముందే సోమవారం సాయంత్రం వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
NH-90 మిలిటరీ హెలికాప్టర్‌లో రాత్రిపూట 50 మందికి పైగా వ్యక్తులను వరదల ప్రాంతాలనుంచి (Tons of evacuated) సైన్యం తరలించింది. డార్ఫీల్డ్ పట్టణానికి సమీపంలో ఉన్న ఒక చెట్టుపై ఒక వ్యక్తి ఎక్కాడు. అయితే అది వరదలకు కొట్టుకుపోతున్న సమయంలో అతను వరదనీటిలోకి దూకి భద్రత కోసం ఈత కొట్టడానికి ప్రయత్నించాడు, కాని వరదనీటిలో కొట్టుకుపోయాడు. హెలికాప్టర్ సిబ్బంది ఆ వ్యక్తిని కనుగొని రక్షించారు. మిలిటరీ హెలికాప్టర్ కూడా ఒక వృద్ధ జంటను వారి కారు పైకప్పు నుండి రక్షించింది.
రాత్రి సమయంలో ముంచెత్తిన వరదలకు ప్రజలను ఇళ్లనుండి ఖాళీ చేయించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని నిరాశ్రయులైన వారికి అండగా ఉంటామని ఆర్మీ లైజన్ ఆఫీసర్ జేక్ ఫాబెర్.
చెప్పారు. పొలంలో ఉన్న వ్యక్తి వరదనీటిలో కొట్టుకుపోతుండగా హెలికాప్టర్ పైలట్ అతనిని రక్షించాడు. కాగా అతని జంతు సంపద అంతా వరదలో కొట్టుకుపోయిందని ఆయన ఆవేదన చెందాడు. 250 జంతువులలో 100 జంతువులు మాత్రమే సజీవంగా ఉన్నాయని కన్నీరు పెట్టుకున్నాడు.
న్యూజిలాండ్ సందర్శించిన ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ విలేకరులతో మాట్లాడుతూ వరదల్లో చిక్కుకున్న వారి గురించి ఆరాతీశారు. అయితే "ఆస్ట్రేలియా వరదలకు కొత్తేమీ కాదు" అని మోరిసన్ చెప్పారు. “ మంటలు, తుఫానులు వంటి వాటితో రెండేళ్ల నుంచి సవాళ్ల మధ్యలో ప్రయాణం చేస్తున్నామని తెలిపారు.