New Zealand December 10: తమ పౌరులను స్మోకింగ్(Smoking) నుంచి బయటపడేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది న్యూజిలాండ్(New Zealand). 2027 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలు సిగరెట్లు(Cigarette) కొనుగోలు చేయకుండా కఠిన నిబంధనలు తీసుకువచ్చింది. ఇందుకోసం గట్టి ప్రణాళికను రూపొందించింది. ఇప్పటికే స్మోకింగ్ కంట్రోల్(Smoking control) కోసం పలు చర్యలను చేపట్టింది న్యూజిలాండ్ (New Zealand). పొగాకు పరిశ్రమ(Tobacco Industry)పై కఠిన ఆంక్షలతో కొరడా ఝుళిపిస్తున్న ప్రపంచ దేశాల్లో ఒకటిగా నిలిచింది.
సుదీర్ఘకాలంలో స్మోకింగ్(Smoking) అడ్డుకునేందుకు ఇతర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది న్యూజిలాండ్. నికోటిన్ లెవెల్స్(Nicotine Levels) తగ్గించిన పొగాకు ఉత్పత్తులు మాత్రమే విక్రయించాలని లేదంటే చర్యలు తప్పవని రిటైల్ వ్యాపారులను హెచ్చరించింది. యువతరం ఏనాడూ సిగరెట్లు(Cigarette) తాగకుండా చూడాలన్నదే మా కోరిక అని న్యూజిలాండ్ సర్కారు తెలిపింది. యువతకు సిగరెట్లు సరఫరా చేసినా, విక్రయించినా నేరంగా పరిగణిస్తాం అని న్యూజిలాండ్(New Zealand) ఆరోగ్యశాఖ సహాయ మంత్రి ఆయేషా వెర్రాల్ తెలిపారు. ప్రస్తుతం న్యూజిలాండ్ వాసుల్లో 15 ఏండ్లు దాటిన వారు 11.6 శాతం మంది స్మోకింగ్ చేస్తున్నారు.
మావోరి యువజనుల్లో స్మోకింగ్ 29 శాతంగా ఉంది. కొత్తగా ప్రతిపాదించనున్న స్మోకింగ్ నిషేధం(Smoking Ban).. పొగాకు ఉత్పత్తుల నిషేధ బిల్లులపై మావోరీ హెల్త్ టాస్క్‌ఫోర్స్‌తో ప్రభుత్వం సంప్రదింపులు జరుపనున్నది. వచ్చే జూన్‌లో పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశ పెట్టనున్నది. వచ్చే ఏడాది చివరికల్లా పొగాకు ఉత్పత్తుల విక్రయ నిషేధ చట్టం(Ban cigarette sales bill) అమల్లోకి రానున్నదని తెలుస్తోంది. 2024 నుంచి దశలవారీగా ఆంక్షలను న్యూజిలాండ్ సర్కార్ అమల్లోకి తేనున్నది. ఆథరైజ్డ్ విక్రేతలను భారీగా తగ్గించనున్నది. 2025లో నికోటిన్ స్థాయి తగ్గించాలన్న నిబంధన అమలు చేయడానికి చర్యలు తీసుకుంటుంది. 2027 నాటికి న్యూజిలాండ్‌ను స్మోక్ ఫ్రీ జనరేషన్‌గా తీర్చిదిద్దనున్నది.
న్యూజిలాండ్‌లో ప్రస్తుతం ఏటా ఐదు వేల మంది స్మోకింగ్‌తో మరణిస్తున్నారు. 18 ఏండ్లలోపు వారిలో ప్రతి ఐదుగురిలో నలుగురు స్మోకింగ్ చేస్తున్నారు. అయితే ఈ నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. కానీ తమ బిజినెస్ లు దెబ్బతింటాయని రిటైలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ మార్కెటింగ్ జరిగే ప్రమాదం ఉందంటున్నారు.