Pyongyang, Sep 29: పక్క దేశాలకు ఉత్తర కొరియా (North Korea) అధినేత కిమ్ జంగ్ ఉన్ చుక్కలు చూపిస్తున్నాడు. క్షిపణి ప్రయోగాలతో ముఖ్యంగా దక్షిణ కొరియాకు చెమటలు పట్టిస్తున్నాడు. తాజాగా ఉత్తర కొరియా గుర్తించబడని బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం (unidentified ballistic missile) చేసినట్లు దక్షిణ కొరియ బలగాలు (Seoul's military) పేర్కొన్నాయి. యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ దక్షిణ కొరియా పర్యటనకు ఒక రోజు ముందు ఉత్తర కొరియా ఈ క్షిపణి ప్రయోగం చేసినట్లు దక్షిణ కొరియా తెలిపింది.
ఉత్తర కొరియా గుర్తించబడని బాలిస్టిక్ క్షిపణిని తూర్పు సముద్రంలోకి ప్రయోగించింది" అని సియోల్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది.ఈ విషయాన్ని జపాన్ కోస్ట్ గార్డు కూడా ధృవీకరించిందని టోక్యో రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. దీని ద్వారా జపాన్ కోస్ట్ గార్డు తీరంలో ఉన్న నౌకలకు హెచ్చరికలు జారీ చేసినట్లు కూడా జపాన్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఏడాది ఉత్తర కొరియా చేసిన రికార్డు స్థాయి ఆయుధ పరీక్షల్లో భాగమైన ఈ ప్రయోగం, ప్యోంగ్యాంగ్ మరో అణు పరీక్షను నిర్వహించేందుకు దగ్గరగా ఉందని సియోల్ గూఢచారి సంస్థ హెచ్చరించిన తర్వాత కూడా ఇది జరిగింది.
దక్షిణ కొరియా ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగం నిర్వహించనుందని హెచ్చరించిన కొద్ది రోజుల్లోనే ఉత్తర కొరియా ఈ క్షిపణి ప్రయోగానికి తెగబడటం గమనార్హం. ఇదిలా ఉండగా..అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ గురువారం దక్షిణ కొరియా రాజధాని సియోల్ చేరుకోనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఆమె ఉత్తర దక్షిణ కొరియాల సరిహద్దు పటిష్ట భద్రతను పర్యవేక్షించనున్నారు.
ఈ వారంలోనే ఈ రెండు దేశాలు రోనాల్డ్ రీగన్ సముద్రతీర ప్రాంతంలో సంయుక్తంగా సైనిక కసరత్తులను నిర్వహించనున్నాయి. ఐతే ఉత్తర కొరియా ఈ ఇరు దేశాల సైనిక కసరత్తులను యుద్ధ సన్నహాలుగా పరిగణిస్తూ ఫైర్ అవుతోంది. ఐతే ఆయా దేశాలు మాత్రం తమ భద్రతా దృష్ట్యా సాగిస్తున్న విన్యాసాలుగా చెబుతున్నాయి.అయితే ఉత్తర కొరియా వాటిని దండయాత్ర కోసం రిహార్సల్స్‌గా చూస్తుంది.కాగా వాషింగ్టన్.. సియోల్ యొక్క ముఖ్య భద్రతా మిత్రదేశం. ఉత్తర కొరియా నుండి రక్షించడానికి దక్షిణ కొరియాలో దాదాపు 28,500 మంది సైనికులను ఇది మోహరించింది.