Oldest Presidents of United States (Photo Credits: Instagram, FB and Wikimedia Commons)

Washington, January 20: అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు (భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 11 గంటల సమయంలో) జరుగనున్న బైడెన్‌ (Joe Biden) ప్రమాణం చేయనున్నారు. రెండువారాల క్రితం అధ్యక్షుడు ట్రంప్‌ మద్దతుదారులు చేసిన దాడులు పునరావృతంకాకుండా పాతిక వేల మంది నేషనల్‌ గార్డు బలగాలు డేగ కండ్లతో నిఘాను మరింత పటిష్ఠం చేశాయి. క్యాపిటల్‌ హిల్‌ భవనం వైపునకు వచ్చే అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో అధ్యక్షుడి ప్రమాణానికి వెయ్యి మంది అతిథులనే అనుమతించబోతున్నట్టు సంబంధిత కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో చట్టసభ సభ్యులు, వారి బంధువులు ఉన్నట్టు పేర్కొంది. ఇంకోవైపు, అమెరికా ఉపాధ్యక్షురాలిగా బుధవారం బాధ్యతలు చేపట్టబోతున్న భారత సంతతి మహిళ కమలాహ్యారిస్‌ కాలిఫోర్నియా సెనేట్‌ పదవికి సోమవారం రాజీనామా చేశారు.

అరవై దేశాలకు పాకిన యుకె కరోనావైరస్, 23 దేశాలకు పాకిన దక్షిణాఫ్రికా రకం కరోనావైరస్, వారంలోనే 47 లక్షల కరోనా కేసులు, కొవిడ్ వారపు నివేదికను విడుదల చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

ఈ సందర్భంగా అత్యంత లేటు వయసులో అమెరికాను ఏలిన గత అయిదు మంది అధినేతల (Oldest Presidents of United States) చరిత్రను ఓ సారి పరిశీలిస్తే...

జో బైడెన్‌: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవబోతున్న జో బైడెన్‌ వయసులో అందరికంటే పెద్ద వాడిగా రికార్డు క్రిచేట్ చేయబోతున్నారు. 78 ఏళ్ల వయసులో ఆయన అధ్యక్ష పదవిని చేపట్టబోతున్నారు. 46 వ ప్రెసిడెంట్ గా ఆయన నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

డోనాల్డ్ ట్రంప్ : 45వ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పెద్ద వ్యాపార వేత్తగా పేరు గడించారు. గవర్నమెంట్ ఆఫీసుతో సంబంధం లేకుండా కేవలం వ్యాపారవేత్తగా అమెరికా పీఠాన్ని డొనాల్డ్ ట్రంప్ అధిరోహించాడు. 2016లో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన ట్రంప్ నేటితో దిగొపోనున్నారు. 50 రాష్ట్రాల్లో 30 రాష్ట్రాల్లో ట్రంప్ హిల్లరీ క్లింటన్ మీద విజయకేతనం ఎగరవేశారు. హిల్లరీ 20 రాష్ట్రాల్లో విజయం సాధించారు. ఈయన పదవి చేపట్టే నాటికి వయసు 70 సంవత్సరాలు

రోనాల్డ్ విల్సన్ : అమెరికా 40 అధినేతగా ఎన్నికైన రొనాల్డ్ పదవిలోకి వచ్చే నాటికి 69 ఏళ్లు. 1981 నుంచి 1989 వరకు ఆయన అమెరికా అధినేతగా సేవలు అందించారు. 1967 నుంచి 1975 కాలిఫోర్నియా గవర్నర్ గా సేవలు అందించారు. ఈయన హాలీవుడ్ యాక్టర్.. ఈయన పదవి చేపట్టే నాటికి వయసు 69 సంవత్సరాలు

విలియం హెన్రీ హారిసన్: 1841లో అమెరికా అధినేతగా ఎన్నికయ్యారు. ఇతను 68 ఏళ్ల వయసులో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అమెరికా మిలిటరీ ఆఫీసర్ గా, రాజకీయ వేత్తగా సేవలందించారు. టైఫాయిడ్, న్యుమోనియా వ్యాధితో 30 రోజుల పాటు పోరాడి మరణించారు. ఈయన పదవి చేపట్టే నాటికి వయసు 68 సంవత్సరాలు

జేమ్స్ బుచాన్ : అమెరికాలో లాయర్ గా రాజకీయ వేత్తగా ఉన్న బుచాన్ అమెరికా 15వ అధినేతగా ఎన్నికయ్యారు. 1857 నుంచి 1861 వరకు ఆయన అధ్యక్ష పదవిలో కొనసాగారు. ఈయన పదవి చేపట్టే నాటికి వయసు 65 సంవత్సరాలు

జార్జ్ బుష్: 64 ఏళ్ల వయసులో అమెరికా అధ్యక్షుడు అయ్యారు. అమెరికా 41వ అధ్యక్షుడిగా 1989 నుంచి 1993 వరకు పనిచేశారు. 43వ వైస్ ప్రెసిడెంట్ గా1981 నుంచి 1989 వరకు కొనసాగారు.