కొత్తగా వచ్చిన ఒమైక్రాన్ వేరియెంట్ వ్యాప్తితో ఆదివారం ప్రపంచవ్యాప్తంగా 4 వేల విమాన సర్వీసులను రద్దు చేశారు.ఒమైక్రాన్ వ్యాప్తి భయంతో యునైటెడ్ స్టేట్స్‌లో సగానికి పైగా విమాన సర్వీసులను రద్దు నిలిపివేశారు. కరోనావైరస్ కేసుల పెరుగుదల కారణంగా హాలిడే ట్రిప్పులు వెళ్లేందుకు ప్రయాణికులు ముందుకు రావడం లేదు. యునైటెడ్ స్టేట్స్ నుంచి పలు దేశాలకు వెళ్లే 2,400 విమానాలను నిలిపివేశారు.
ఒమైక్రాన్ వేరియెంట్ ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా 11,200 విమాన సర్వీసులు ఆలస్యంగా రాకపోకలు సాగించాయని ఫ్లైట్ అవేర్ అనే వెబ్‌సైట్ తెలిపింది.510 స్కైవెస్ట్ విమాన సర్వీసులు, 419 సౌత్ వెస్ట్ విమానాలు రద్దు అయ్యాయి. పైలెట్లు, క్యాబిన్ క్రూ సిబ్బంది క్వారంటైన్ లో ఉండటంతో విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని విమానయాన సంస్థలు తెలిపాయి.ఒమైక్రాన్ వ్యాప్తితో క్రిస్మస్, న్యూఈయర్ సెలవుల్లో విమాన ప్రయాణానికి ప్రయాణికులు ముందుకు రాలేదు.
Omicron-related disruptions cause over 4,000 flight cancellations to kick off 2022 https://t.co/Bv7ZtAJyPC pic.twitter.com/fV0hdz6HKD
— Reuters (@Reuters) January 2, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)