Canadian Prime Minister Justin Trudeau

Ontario, June 8: కెన‌డాలో దారుణ ఘటన చోటు చేసుకుంది ఓ వ్య‌క్తి ముస్లింల‌ను టార్గెట్ చేశాడు. త‌న ట్ర‌క్కుతో ఆ ముస్లిం ఫ్యామిలీలో న‌లుగుర్ని ఢీకొట్టి చంపేశాడు. రోడ్డు ప‌క్క‌న న‌డుచుకుంటూ వెళ్తున్న అయిదుగురిపై న‌ల్ల‌టి ట్ర‌క్కుతో నిందితుడు ఢీకొట్టాడు. ఈ ఘ‌ట‌న ఒంటారియో ప్రావిన్సులో జ‌రిగింది. ముంద‌స్తుగానే ప్లాన్ వేసి ఈ దాడికి పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఈ కేసులో 20 ఏళ్ల వ్య‌క్తిని అరెస్టు చేశారు. ప్ర‌ణాళిక ప్ర‌కార‌మే హ‌త్య జ‌రిగిన‌ట్లు పోలీసులు చెప్పారు. విద్వేషంతో అత‌ను ఆ దాడికి పాల్ప‌డిన‌ట్లు తెలిపారు. బాధితులు కేవ‌లం ముస్లింలు కావ‌డం వ‌ల్లే వారిని చంపేసిన‌ట్లు పోలీసులు చెప్పారు. ఈ దాడిలో గాయ‌ప‌డ్డ తొమ్మిదేళ్ల బాలుడు కోలుకుంటున్నాడు. టార్గెట్ చేసి నిందితుడు నెతాన్యుల్ వెల్ట్‌మాన్‌ సామూహిక హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కెనడా ప్రధాని తీవ్ర ధిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరణించిన వారికి సంతాపాన్ని ప్రకటించారు. 'మా సమాజాలలో ఇస్లామోఫోబియాకు స్థానం లేదని తెలిపారు.

Here's Canada PM Tweets: 

Here's ANI Update

ఈ ఘటన తర్వాత ట్విట్టర్లో కెనడా ప్రధాని వరుస ట్వీట్లు చేశారు. దేశ ముస్లిం సమాజంపై జరుగుతున్న ద్వేషపూరిత దాడిని ఆయన ఖండించారు.దేశంలో పెరుగుతున్న ఇస్లామోఫోబియాను ఎదుర్కోవడంలో సిద్ధంగా ఉన్నామని ప్రతిజ్ఞ చేశారు. కెనడా అధ్యక్షుడు దేశంలోని ముస్లిం సమాజానికి తన మద్దతును ధృవీకరించి, "లండన్లోని ముస్లిం సమాజానికి మరియు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు, మేము మీతో నిలబడతామని తెలుసుకోండి. ఇస్లామోఫోబియాకు మా సమాజాలలో స్థానం లేదు. ఇలాంటి ఎవరూ హర్షించను అని ట్వీట్ చేశారు.

దారుణమైన ఈ విద్వేషపూరిత నేరంపై తన బాధను వ్యక్తం చేసిన అధ్యక్షుడు ట్రూడో, ఈ వార్తలతో తాను భయపడ్డానని అన్నారు. అంటారియో ఘటనతో చాలా బాధకు గురయ్యానని, మరణించిన వారికి సంతాపం తెలియజేస్తున్నామని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని కాపాడుకుంటామని ఆయన అన్నారు.

ఘోర రైలు ప్రమాదం, 30 మంది అక్కడికక్కడే మృతి, 50 మందికి పైగా గాయాలు, పాకిస్థాన్‌లో ఢీ కొన్న రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు, సింధ్ ప్రాంతంలో రెటి, దహార్కి రైల్వే స్టేషన్ల మధ్య ఘటన

20 ఏళ్ల నివాసి నాథనియల్ వెల్ట్మాన్ రోడ్డు మీద వెళ్తున్న ముస్లిం కుటుంబాన్ని తన ట్రక్కుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో కుటుంబంలో నలుగురు అక్కడికక్కడే మరణించగా తొమ్మిదేళ్ల బాలుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇది ప్లాన్ ప్రకారమే జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ముస్లిం కుటుంబమే లక్ష్యంగా నిందుతుడు ఈ దాడికి పాల్పడ్డారని తేల్చారు. ఈ సంఘటన తర్వాత లండన్, ఒంటారియో నివాసి అయిన వెల్ట్‌మన్ అరెస్టు చేయబడ్డాడు, అతనిపై నాలుగు డిగ్రీల ఫస్ట్-డిగ్రీ హత్య , ఒక హత్యాయత్నం కేసు నమోదైంది. సోమవారం రిమాండ్‌కు నిందితుడిని తరలించి  గురువారం తిరిగి కోర్టులో హాజరుపరచనున్నారు.