Islamabad, November 11: భారత్‌పై విషప్రచారం చేయడంలో ఏ అవకాశాన్నీ వదులుకోని పాకిస్తాన్ మరో దుశ్చర్యకు పాల్పడింది. కరాచీలోని పాకిస్థాన్ వాయుసేన వార్ మ్యూజియం(Pakistan Air Force War Museum)లో భారత వాయుసేన వింగ్‌కమాండర్ అభినందన్ వర్ధమాన్ (Wing Pilot Abhinandan Varthaman) బొమ్మను కొలువుదీర్చారు. వర్ధమాన్ చుట్టూ పాక్‌సైనికులు చుట్టుముట్టి ఉండగా, ఎడమ పక్క ఒక టీ కప్పును కూడా ఉంచింది. ఈ ఫొటోను పాకిస్థానీ జర్నలిస్ట్ అన్వర్ లోధీ ఆదివారం ట్వీట్ చేశారు.
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వాయుసేన (Indian Air Force) ఫిబ్రవరిలో పాకిస్తాన్ లోని బాలాకోట్ లో ఉన్న ఉగ్రశిబిరాలపై మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే. బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ (IAF Abhinandan Varthaman) పాకిస్తాన్ యుద్ధ విమానాలను వెంబడించాడు. మిగ్-21 విమానాన్ని నడుపుకుంటూ, పొరపాటున పాక్ గగనతలంలోకి ప్రవేశించగా, దాన్ని కూల్చివేసిన పాక్ దళాలు(Pakistan Air Force), అభినందన్ ను బంధీగా పట్టుకున్నాయి.
పాకిస్తాన్ జర్నలిస్ట్ అన్వర్ లోధీ ట్వీట్
PAF has put mannequin of Abhi Nandhan on display in the museum. This would be a more interesting display, if it they can arrange a Cup of FANTASTIC tea in his hand. pic.twitter.com/ZKu9JKcrSQ
— Anwar Lodhi (@AnwarLodhi) November 9, 2019
ఆ వెంటనే అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చిన ఒత్తిడితో, మార్చి 1న వాఘా సరిహద్దు వద్ద అతన్ని విడిచిపెట్టారు. ఆ సందర్భంగా పాక్ సైన్యం విడుదలచేసిన వీడియోలో అభినందన్ చాయ్ తాగుతూ కనిపించారు.
ఈ ఘటనపై అప్పట్లో సామాజిక మాధ్యమాల్లోనూ పాకిస్తాన్ వ్యంగ్య ప్రచారాన్ని చేసింది. తాజాగా అభినందన్ బొమ్మను మ్యూజియంలో ప్రదర్శించింది. దీనిని పాకిస్తాన్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు అన్వర్‌లోధీ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
‘అభినందన్ బొమ్మ చేతిలో ఒక టీ కప్పు ఉంచితే బొమ్మకు మరింత పరిపూర్ణత వచ్చేది’అని లోధీ వ్యాఖ్యానించాడు. అభినందన్ పాకిస్తాన్ అదుపులో ఉన్నప్పుడు పాక్ సైన్యం విడుదల చేసిన ఒక వీడియోలో అభినందన్ టీ తాగుతున్నట్టుగా చూపించడంతో లోధీ ఈ వ్యాఖ్యలు చేశారు.