Pakistan 'Highway Rape' Case: రేప్ చేస్తే అవి తీసి పడేయండి, గ్యాంగ్ రేప్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, దేశంలో పెను ప్రకంపనలు రేపుతున్న హైవేపై సామూహిక అత్యాచారం ఘటన
Inflation, unemployment biggest issues in Pakistan; not Kashmir: Gallup-Gilani Survey(Photo- facebook)

Islamabad, Sep 15: పాకిస్తాన్ దేశవ్యాప్తంగా నిరసనలు రేకెత్తించిన హైవేపై సామూహిక అత్యాచారం కేసులో (Pakistan 'Highway Rape' Case) నిందితుడు అరెస్టు అయిన తరువాత ఈ ఘటనపై పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి దారుణ లైంగిక నేరాలకు రసాయన కాస్ట్రేషన్ ద్వారా (Chemically Castrated) శిక్షించాలని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోమవారం అన్నారు. పాకిస్థాన్‌లోని లాహోర్ హైవేపై ఇటీవ‌ల ఓ మ‌హిళ‌ను అత్యంత క్రూరంగా రేప్ చేశారు.

ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్న మ‌‌హిళ‌ను ఇద్ద‌రు గ‌న్‌పాయింట్‌లో బెదిరించి అత్యాచారం చేశారు. ఈ ఘ‌ట‌న పాకిస్థాన్‌లో పెను సంచ‌ల‌నం రేపింది. యావ‌త్ దేశం ఆ ఘ‌ట‌న ప‌ట్ల నిరసన వ్య‌క్తం చేస్తూ..నిందితుల‌కు క‌ఠిన శిక్ష వేయాల‌ని డిమాండ్ వ‌చ్చింది. వందలాది మంది మహిళలు పాకిస్తాన్ అంతటా నగరాల వీధుల్లోకి వచ్చారు.

కాగా ఒక మగ సహచరుడు లేకుండా రాత్రి డ్రైవింగ్ చేస్తున్నందున పోలీసు అధికారి బాధితురాలిని నిందించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలోఈ కేసు ఇంకా అనేక ఆందోళనలకు కారణమయింది. బాధితురాలికి సహాయం చేయడం మానేసి ఆమెదే తప్పు అని లాహోర్ పోలీసు చీఫ్ ఉమర్ షేక్ అనడంతో దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో షేక్ క్షమాపణలు కోరాడు. ఈ ఘటనపై పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ (PAK PM Imran Khan) స్పందించారు. అత్యాచార కేసులో దోషిగా తేలిన వారిని బ‌హిరంగంగా ఉరి తీయాల‌న్నారు. లేదంటే ర‌సాయ‌నిక ప‌ద్ధ‌తిలో రేప్‌కు పాల్ప‌డిన‌వారి వృష‌ణాలు ప‌నిచేయకుండా చేయాల‌ని సూచించారు.

చైనా భారీ కుట్ర, దేశంలో అగ్రనేతలపై రహస్య నిఘా, సంచలనం రేపుతున్న జాతీయ పత్రిక కథనం, ఇందులో ఆశ్చర్యమేమీ లేదని కేంద్రం తెలిపినట్లుగా మరో పత్రిక కథనం

వాస్త‌వానికి బ‌హిరంగంగా ఉరి తీయాల‌ని ఆదేశం ఉన్నా.. పాకిస్థాన్ ఆ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌లేద‌ని, ఎందుకంటే అలా చేస్తే యూరోపియ‌న్ యూనియ‌న్ త‌మ వాణిజ్య సంబంధాల‌ను తెంచుకుంటుంద‌న్నారు. ఈ నేప‌థ్యంలో కెమిక‌ల్ క్యాస్ట్రేష‌న్ (Rapists to be Chemically Castrated) ప‌ద్ధ‌తికి తాను మెగ్గుచూపుతున్న‌ట్లు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. హ‌త్య‌ల్లో ఫ‌స్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థార్డ్ డిగ్రీ ఉన్న‌ట్లే.. రేప్‌కు పాల్ప‌డిన వారికి ఫ‌స్ట్ డిగ్రీలో భాగంగా వారి వృష‌ణాల‌ను తొల‌గించాల‌న్న సూచ‌న చేశారు. పాకిస్తాన్ వార్తా కేంద్రం ఛానల్ 92 కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఇమ్రాన్ ఈ కామెంట్ చేశారు.హైవేపై జ‌రిగిన రేప్‌కు సంబంధించిన నిందితుల‌ను అరెస్టు చేశారు.

కాగా రసాయన కాస్ట్రేషన్ అనేది ఒక వ్యక్తి యొక్క లిబిడోను తగ్గించడానికి మందులను ఉపయోగించడం. సామూహిక అత్యాచారం కేసులో ఇద్దరు నిందితుల్లో ఒకరైన షఫ్కత్ అలీని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. "అతని డిఎన్ఎ సరిపోలింది, అతను నేరాన్ని అంగీకరించాడు" అని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి ఉస్మాన్ బుజ్దార్ ట్విట్టర్లో తెలిపారు. ఒక సీనియర్ పోలీసు అధికారి ఈ అరెస్టును ధృవీకరించారు, రెండవ నిందితుడి కోసం వెతుకులాట కొనసాగుతోంది.