PM Modi In Australia (photo-ANI)

Sydney, May 23: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు భారీ సంఖ్యలో ఉన్నారు. ఆయన ఏ దేశానికి వెళ్లినా అక్కడున్న భారత సంతతి ప్రజలు పెద్ద సంఖ్యలో కలిసేందుకు వస్తున్నారు. ఇప్పటికే పలు దేశాల పర్యటనకు వెళ్లిన సందర్భాల్లో అభిమానులు, భారత సంతతి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. తాజాగా ప్రధాని మోదీ.. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడున్న భారతీయులు ప్రధానికి వినూత్నంగా స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వెల్‌కమ్ మోడీ, అస్ట్రేలియాలో మోడీ క్రేజ్ చాటిచెప్పే వీడియో ఇదిగో, సిడ్నీలో భారత ప్రధానికి ఘన స్వాగతం పలికిన భారతీయ సమాజం

ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న మోదీని కలిసేందుకు ఏకంగా ఓ విమానాన్ని బుక్ చేసుకుని మరీ వచ్చారు. సోమవారం రాత్రి మెల్ బోర్న్ నుంచి సిడ్నీకి ప్రయాణించారు. తాము ప్రయాణించిన విమానానికి మోదీ ఎయిర్ వేస్ అని పేరుపెట్టుకున్నారు. మోదీ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఇండియన్ ఆస్ట్రేలియన్ డయాస్పొరా ఫౌండేషన్ (ఐఏడీఎఫ్) సిడ్నీలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది.

Videos

ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆస్ట్రేలియాలోని భారత సంతతి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇందులో భాగంగానే మెల్ బోర్న్ లోని మోదీ మద్దతుదారులు, అభిమానులు కూడా సిడ్నీకి బయలుదేరారు.ఐఏడీఎఫ్ సభ్యులు 170 మంది కలిసి ప్రత్యేకంగా ఓ విమానాన్ని బుక్ చేసుకున్నారు. సోమవారం రాత్రి మెల్ బోర్న్ నుంచి సిడ్నీకి ప్రయాణిస్తూ వాళ్లు చేసిన హడావుడి మామూలుగా లేదు. చేతిలో మువ్వన్నెల జెండా, టర్బన్లతో విమానంలో డ్యాన్సులు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పెట్టడంతో అది కాస్తా వైరల్ గా మారింది.

మోదీ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఇండియన్ ఆస్ట్రేలియన్ డయాస్పొరా ఫౌండేషన్ (ఐఏడీఎఫ్) సిడ్నీలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆస్ట్రేలియాలోని భారత సంతతి ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలి వస్తున్నారు. ఇందులో భాగంగానే మెల్‌బోర్న్‌లోని మోదీ మద్దతుదారులు, అభిమానులు కూడా సిడ్నీకి బయలుదేరారు. వీరంతా సోమవారం రాత్రి మెల్ బోర్న్ నుంచి సిడ్నీకి ప్రయాణించారు.