Moscow, OCT 25: రష్యా అధ్యక్షుడు (Russian President) వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) ఆరోగ్యం (Health)పై మరోసారి వదంతులు షికార్లు చేస్తున్నాయి. పుతిన్‌ గుండెపోటుకు గురయ్యారంటూ అంతర్జాతీయ మీడియాలో వరుస కథనాలు దర్శనమిస్తున్నాయి. దీనిపై క్రెమ్లిన్‌ స్పష్టతనిచ్చింది. అధ్యక్షుడు పుతిన్‌ ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలను ఖండించింది. ఆయన దృఢంగా, ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేసింది. ఇక ఇదే సమయంలో పుతిన్‌ తనలాంటి మరో వ్యక్తిని డూప్‌గా ఉపయోగిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపైనా క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ ( Dmitry Peskov) స్పందించారు. అవన్నీ అసత్య ప్రచారాలే అని కొట్టిపారేశారు. 2020లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పుతిన్‌.. తన డూప్‌ గురించి వస్తున్న వార్తలపై స్పందించారు. అవన్నీ అవాస్తవాలే అని అప్పట్లో స్పష్టం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా గతంలో ఒకసారి డూప్‌ను ఉపయోగించుకున్నట్లు వివరించారు.

Putin Suffers Heart Attack: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు గుండెపోటు, మంచం మీద నుంచి నేలపై పడిపోయి కనిపించిన రష్యా అధినేత, వార్తలు వైరల్ 

కాగా, మంగళవారం రాత్రి పుతిన్‌ గుండెపోటుకు గురైనట్లు వదంతులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు బ్రిటన్‌ దినపత్రిక ‘ద ఎక్స్‌ప్రెస్‌ యూకే’ వార్తా కథనం వెలువరించింది. అధ్యక్షుడు పుతిన్‌ అధికారిక భవనం మాజీ అధికారి ఒకరు నడుపుతున్న టెలిగ్రామ్‌ ఛానల్‌ (జనరల్‌ ఎస్‌వీఆర్‌) తొలుత ఈ విషయాన్ని పోస్ట్‌ చేసిందని వార్తా కథనం పేర్కొన్నది. 71 ఏండ్ల పుతిన్‌.. ఓ ప్రైవేట్‌ భవనంలో ఉండగా హఠాత్తుగా నేలపై పడిపోయారని, కను గుడ్లు రెండూ తేలేశారని, అధ్యక్షుడు కిందపడ్డ శబ్దం విని వ్యక్తిగత భద్రతా సిబ్బంది వెంటనే ఆయన వద్దకు వచ్చారని సదరు టెలిగ్రామ్‌ ఛానల్‌ తన పోస్ట్‌లో తెలిపింది. ఈ వార్తలను తాజాగా క్రెమ్లిన్‌ ఖండించింది.

Mexico Horror: పోలీసు కాన్వాయ్‌ పై బుల్లెట్ల వ‌ర్షం.. 13 మంది పోలీసులు సహా మొత్తం 17 మంది మృతి 

కాగా, గతేడాది ఉక్రెయిన్‌ (Ukraine)పై యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు (Russian President) వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) అనారోగ్యంపై రకరకాలుగా వార్తలు పుట్టుకొస్తున్న విషయం తెలిసిందే. పుతిన్‌ క్యాన్సర్‌, పార్కిన్సన్స్‌ వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారంటూ వరుస కథనాలు వెలువడ్డాయి. అందుకోసం చికిత్స చేయించుకుంటున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, వాటిని ఎప్పటికప్పుడు రష్యా అధికారులు ఖండిస్తూ వచ్చారు. అవన్నీ వదంతులే అని, అధ్యక్షుడు ఆరోగ్యంగా ఉన్నారంటూ రష్యా నేతలు చెప్పుకొచ్చారు.