Kuwait, July 22:పెళ్లయిన నెలలు కాదు.. గంటలు కూడా కాలేదు. మూడు నిమిషాల్లోనే ఓ జంట విడాకుల కోసం కోర్టుకెక్కింది. వినడానికే విడ్డూరంగా ఉన్నా.. విడాకులు నిజమేనండి బాబూ..! ఈ ఘటన ఎక్కడ జరిగింది ? కారణాలు ఏంటో తెలుసుకుంటే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే..! వెళితే.. ఈ విడాకుల ఘటన కువైట్‌లో చోటు చేసుకున్నది. పెళ్లయిన మూడు నిమిషాలకు జంట కోర్టును ఆశ్రయించగా.. కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. పెళ్లి తంతు పూర్తయ్యాక పెళ్లి వేడుక నుంచి వెళ్తున్న సమయంలో పెళ్లికూతురు బ్యాలెన్స్ కిందపడిపోయింది. పక్కన ఉన్న వరుడు ఆమెను చేతులు పట్టుకొని లేవదీయాల్సిందిపోయి.. ‘తెలివి తక్కువ దద్దమ్మ’ అంటూ తిట్టిపోశాడు. ఈ మాటలకు నొచ్చుకున్న పెళ్లి కూతురు తక్షణమే వరుడితో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుంది. పెళ్లిని రద్దు చేసుకుంటున్నానంటూ కోర్టుకు వెళ్లింది. విచారణ ముగిసిన తర్వాత కోర్టు సైతం విడాకులు మంజూరు చేసింది.
Earthquake in Chile: చిలీలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 7.3 తీవ్రత నమోదు
ఈ కేసు కువైట్ చరిత్రలోనే అతి స్వల్పకాల పెళ్లిగా పేర్కొంటున్నారు. వాస్తవానికి ఈ ఘటన 2019లో జరగ్గా.. తాజాగా మరోసారి వైరల్ అయ్యింది. తాను ఒక వివాహానికి పెళ్లి వేడుకకు వెళ్లానని.. అక్కడ పెళ్లికూతురుని వరుడు ఎగతాళి చేస్తూ ఉండిపోయాడని.. ఆమె కూడా ఆ మహిళలా విడాకులు ఇచ్చి ఉండాల్సిందంటూ ఓ వ్యక్తి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. దాంతో విడాకులు విషయం మరోసారి వైరల్ అయింది. గౌరవం లేకపోవడం పెళ్లిలో తొలి వైఫల్యమని సదురు వ్యక్తి పేర్కొన్నాడు. పెళ్లి మొదట్లోనే ఈ విధంగా ప్రవర్తించే వ్యక్తులను వదిలివేయడం మంచిదని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. 2004లో యూకేలో ఒక జంట మాత్రం పెళ్లయిన 90 నిమిషాల తర్వాత విడాకుల కోసం కోర్టుని ఆశ్రయించింది. రిజిస్టర్ ఆఫీస్‌లో స్కాట్ మెక్కీ, విక్టోరియా ఆండర్సన్ పెళ్లి చేసుకున్నారు. తోటి పెళ్లికూతుళ్లను ఇబ్బంది పెట్టినందుకు పెళ్లి కొడుకుపై వధువు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఘర్షణ విడాకులకు దారి తీసింది.