Ottawa, July 31: శృంగారం విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో తరహా ఆలోచన. భంగిమల విషయంలో కానీ, సమయం విషయంలో కానీ డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడున్న జనరేషన్‌లో పెళ్లికి ముందు శృంగారం చేస్తున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అయితే సెక్స్ (SEX)చేసే సమయంలో సేఫ్టీ పాటిస్తున్నారు చాలామంది జంటలు. కానీ కెనడాలో (Canada)ఓ జంట తమ శృంగారానికి సంబంధించి కోర్టు మెట్లు ఎక్కింది. సెక్స్ చేస్తున్న సమయంలో తన అనుమతిలేకుండా కండోమ్ (condom) తీసేశాడని ఓ యువతి కోర్టును ఆశ్రయించింది. దీంతో విచారణ జరిపింది కెనడా కోర్టు.సెక్స్ సమయంలో భాగస్వామి అనుమతి లేకుండా కండోమ్ తీసేయడం (Removing condom )ముమ్మూటికీ నేరమే అని తీర్పు ఇచ్చింది కోర్టు. ఇష్టపూర్వకంగా సెక్స్ చేస్తున్నప్పటికీ కండోమ్ విషయంలో కూడా ఇరువురి సమ్మతి అవసరమని తెలిపింది. దాంతో ఈ తీర్పు సంచలనంగా మారింది.
కెనడాకు చెందిన ఓ యువతికి ఆన్‌లైన్‌లో (online) ఓ వ్యక్తితో పరిచయం అయింది. వారిద్దరి మధ్య చాలాకాలం చాటింగ్ కొనసాగిన తర్వాత డైరక్ట్‌గా కలుసుకున్నారు. 2017లో ఈ ఇద్దరు తొలిసారి ప్రత్యక్షంగా కలుసుకున్నారు. అయితే సెక్స్‌కు సంబంధించి ఇద్దరి మధ్య ఓ ఒప్పందం జరిగింది. కండోమ్ లేకుండా శృంగారం చేయవద్దని వ్యక్తికి యువతి కండీషన్ పెట్టింది. దానికి అతను కూడా ఒప్పుకున్నాడు. కానీ సెక్స్ చేస్తున్న సమయంలో అతను కండోమ్ (Removing condom) తీసేశాడు.
అంతా సజావుగానే జరిగింది కానీ కొద్దిరోజుల తర్వాత అతను హెచ్‌ఐవీ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్లు యువతికి తెలిసింది. దాంతో అతనిపై కేసుపెట్టింది. దానికి సంబంధించి కోర్టులో సుధీర్ఘ విచారణ జరిగింది. కింది కోర్టులో తనకు న్యాయం జరుగలేదని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది యువతి. అక్కడ యువతికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ముందుగా కండోమ్ గురించి ఇద్దరి మధ్య ఒప్పందం ఉన్నప్పటికీ తప్పు చేసినందుకు ఆ వ్యక్తికి శిక్ష విధించింది.