Russia-Ukraine War (Photo-PTI)

Kyiv, July 8:  రష్యా సైన్యం ఉక్రెయిన్‌లోని పలు సిటీలపై క్షిపణులతో విరుచుకుపడింది.సోమవారం ఉక్రెయిన్‌ నగరాలపై పదుల సంఖ్యలో మిసైల్స్‌తో విరుచుకుపడింది. ఉకక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఓ చిన్న పిల్లల హాస్పిటల్‌పై మిసైల్స్‌తో దాడి చేసింది. రష్యా దాడిలో సుమారు 20 మంది మరణించగా 50 మందికిపైగా గాయపడినట్లు వెల్లడించారు. ఆసుపత్రి శిథిలాల కింద చిన్నారులు చిక్కుకుని ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఇక్కడితో ఆగకుండా క్రైవీ రిహ్ సిటీలోని సెంట్రల్‌ యూనివర్సిటీపై మరోదాడి చేశారు. ఈ మిసైల్స్‌ దాడిలో మరో 10 మంది మృతి చెందారు.  దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్‌ బోట్లపై గొడ్డళ్లు, కత్తులతో దాడి చేసిన చైనా సైనికులు, వీడియో ఇదిగో..

ఉక్రెయిన్‌లోని ఐదు సిటీలను రష్యా సైనికులు టార్గెట్‌ చేశారు. పలు భవనాలు, అపార్టుమెంట్లపై 40కి పైగా మిసైల్స్‌ ప్రయోగించారు. ప్రపంచం ప్రస్తుతం మౌనంగా ఉండకూడదు. ఎందుకంటే రష్యా ఏంటో, ఆ దేశం ఎలాంటి దాడులో చేస్తోందో ప్రపంచం మొత్తం గమనించాలి’’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ సోషల్‌మీడియాలో పేర్కొన్నారు. రష్యా సైన్యం సోమవారం చేసిన దాడుల్లో సుమారు 20కిపైగా మంది మృతి చెందారు. మిసైల్‌ దాడుల్లో సుమారు 50 మంది గాయపడ్డారు’అని ఉక్రెయిన్‌ మంత్రి ఇహోర్ క్లైమెన్కో తెలిపారు.

క్రైవీ రిహ్ నగరంలో జరిగిన దాడుల్లో 10 మంది మృతి చెందగా 31 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక్కడ ఒక్కసారిగా పెద్దఎత్తున మిసైల్స్‌ దాడి జరిగిందని అధికారుల వెల్లడించారు. అమెరికాలోని వాషింగ్టన్‌ నగరంలో మూడు రోజుల నాటో సమావేశాల నేపథ్యంలో రష్యా ఉక్రెయిన్‌పై మిసైల్స్‌తో మెరుపుదాడులకు దిగటం గమనార్హం