London, August 4: యునైటెడ్ కింగ్‌డమ్ (United Kingdom) లోని సఫోక్ సముద్రం (Sea) మధ్యలో ఓ దేశం ఉంది. ఆ దేశానికి కరెన్సీ, జెండాతో పాటు ప్రత్యేక జాతీయగీతం కూడా ఉంది. తమ పౌరులకు వేగవంతమైన పాస్ పోర్ట్ సేవలు కూడా అక్కడి ప్రభుత్వం అందిస్తుంది. ఇన్ని విశేషాలు ఉన్న ఆ దేశం జనాభా (Population) లో, ఆర్ధిక పరిపుష్టిలో బలంగా ఉన్నదని మీరు భావిస్తున్నారు కదూ. అదేం లేదు. ఓ తండ్రి, కూతురు.. రెండు రాతి స్తంభాలపై (Stone pillers) ఉన్న ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకొని దాన్నే ఓ దేశంగా మార్చేశారు. ప్రపంచంలో చిన్న దేశంగా వాటికన్ సిటీ (Vatican City)ని పిలుస్తున్నప్పటికీ, అనధికారికంగా అతి చిన్న దేశం ఇదే. నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
రద్దీ రహదారిపై కారులోంచి పడిపోయిన చిన్నారి.. వెనుకనుంచి స్పీడ్ గా వస్తున్న వాహనాలు.. తర్వాత ఏమైంది?
సముద్రంలో ఏర్పాటు చేసిన రెండు భారీ స్తంభాలపై పూర్తిగా మానవులు ఏర్పాటు చేసిన ప్రాంతమే ‘సీలాండ్’. రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్నప్పుడు 1943లో అప్పటి యూకే (UK) ప్రభుత్వం తన రక్షణ అవసరాల కోసం ఈ కోటను నిర్మించుకుంది. యుద్ధం ముగిశాక ఖాళీగా మిగిలిన ఈ కోటకు జాక్ మూరే, అతని కూతురు జేన్ చేరుకున్నారు. ఓ రేడియో స్టేషన్ (Radio Station) తరఫున వాళ్ళు ఇక్కడకు వచ్చారు. అనంతరం ఈ కోట గురించి విన్న ఆ రేడియో స్టేషన్ అధినేత 1967 సెప్టెంబర్ 2న ఈ కోటను ఆక్రమించుకుని, ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్నాడు. అన్నట్టు ఈ దేశ జనాభా 27 మంది మాత్రమే! ఈ దేశం విస్తీర్ణం 0.004 చదరపు కిలోమీటర్లు.