Newdelhi, Dec 29: దక్షిణకొరియాలో కుప్పకూలిన విమాన ప్రమాదంలో (South Korea Plane Crash) మృతుల సంఖ్య 179 మందికి చేరింది. అసలేం జరిగిందంటే.. ప్యాసింజర్లు, సిబ్బంది కలిపి మొత్తం 181 మందితో థాయ్ లాండ్ నుంచి వస్తున్న ‘జెజు ఎయిర్ ఫ్లైట్ 2216’ విమానం ల్యాండింగ్ సమయంలో కుప్పకూలింది. ఒక్కసారిగా భారీగా మంటలు ఎగసిపడి పేలిపోయింది. సౌత్ జియోల్లా ప్రావిన్స్ లోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ ప్రమాదంలో 179 మంది మృతి చెందినట్టు తేల్చారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరణాల సంఖ్య మరింత పెరగవచ్చని తెలుస్తోంది. ఆదివారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది.
సౌత్ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి!
ప్రమాద సమయంలో విమానంలో 181 మంది
179 మంది మరణించి ఉంటారని వెల్లడించిన సౌత్ కొరియా అగ్నిమాపక శాఖ
మొత్తం ప్రయాణికుల్లో ఇద్దరే బతికారని, వారిని ఆసుపత్రికి తరలించినట్లు ప్రకటన https://t.co/jXAqWV6ocr
— BIG TV Breaking News (@bigtvtelugu) December 29, 2024
కారణం అదేనా?
విమానం ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడంతోనే రన్ వే గోడకు తాకి విమానం ప్రమాదానికి గురైనట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. విమానం ల్యాండ్ అయ్యి రన్‌పై కొద్దిదూరం ప్రయాణించిన తర్వాత ఒక్కసారిగా పొగలు వెలువడి పెద్ద పేలుడు సంభవించి మంటలు ఎగసిపడ్డాయి.