Newdelhi, Oct 28: మొన్నటివరకూ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా రికార్డుల్లో నిలిచిన చైనా (China) ఇప్పుడు రెండో స్థానానికి పడిపోగా, ఇండియా ఆ స్థానాన్ని ఆక్రమించింది. అది పక్కనపెడితే, చైనాలో జనాభా నియంత్రణ చర్యలతో జననాల రేటు పడిపోవడంతో వేలాది కిండర్ గార్టెన్స్, ప్రైమరీ స్కూల్స్ (Kindergartens Closed Across China) మూతపడుతున్నాయి. 2023లో 14,808 కిండర్ గార్టెన్స్ మూతపడినట్లు చైనా విద్యా శాఖ వార్షిక నివేదిక వెల్లడించింది. వరుసగా మూడు సంవత్సరాల నుంచి కిండర్ గార్టెన్ లో చేరే చిన్నారుల సంఖ్య తగ్గిపోతున్నది. గత ఏడాది అంతకుముందు సంవత్సరం కన్నా 53.5 లక్షల మంది చిన్నారులు తగ్గిపోయారు. 2023లో 5,645 ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి.
తిరుపతిలో వరుస బాంబు బెదిరింపులు.. ఇస్కాన్ ఆలయానికి తాజాగా బెదిరింపులు.. నగరవాసులు, భక్తులు ఆందోళన
#China #Kindergartens #ChinasPopulationCrises
చైనాలో తీవ్ర జనాభా సంక్షోభం.. తగ్గిపోతున్న జననాలు.. మూత పడుతున్న ప్రైమరీ స్కూల్స్https://t.co/zp6sThbTo5
— TV9 Telugu (@TV9Telugu) October 28, 2024
ఎందుకూ ఈ సమస్య
చైనాలో ఒకవైపు చిన్నారుల సంఖ్య తగ్గుతుంటే మరోవైపు వృద్ధుల సంఖ్య పెరుగుతున్నది. ప్రస్తుతం వృద్ధులు ప్రభుత్వ సామాజిక భద్రత పథకాలపై ఆధారపడుతున్నారు. ఫలితంగా ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతున్నది. ఆర్ధిక వ్యవస్థపై కూడా ప్రభావం పడుతున్నది. దీంతో 2016లో ఇద్దరు పిల్లలకు జన్మనివ్వడానికి దంపతులకు అనుమతి ఇచ్చారు. 2021లో దీనిని సవరించి ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడానికి అనుమతించారు. కానీ ధరల భారం భయంతో దంపతులు ఎక్కువ మంది పిల్లలను కనేందుకు ఇష్టపడటం లేదు. దీంతో ఈ సమస్య ఏర్పడింది.