Typhoon Rai: చరిత్రలో ఘోర తుఫాను, సైక్లోన్ రాయ్‌ దెబ్బకు 208 మంది మృతి, ఫిలిప్పీన్స్ దేశానికి పెను విషాదాన్ని మిగిల్చిన టైఫూన్, ఒక్క బోహోల్​ రాష్ట్రంలోనే 100కి పైగా మరణాలు
Satellite picture of cyclone Amphan (Photo Credits: IMD)

Manila, Dec 20: ఫిలిప్పీన్స్ దేశం​లో టైఫూన్ దెబ్బకు మాటలకందని విషాదం చోటు చేసుకుంది. మహా తుఫాను (Typhoon Rai) విరుచుకుపడి ఆ దేశాన్ని వణింకిచింది. సైక్లోన్ రాయ్‌ తుపాను ధాటికి మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ప్రకృతి విపత్తు ధాటికి ఇప్పటి వరకు 208 మృతి (Deaths Surge To 208) చెందారని అక్కడి అధికారులు వెల్లడించారు. అంతేకాదు ఒక్క బోహోల్​ రాష్ట్రంలోనే 100కి పైగా మరణాలు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఇటీవల కాలంలో తుపాను వల్ల ఇంతమంది చనిపోవడం ఈ దేశంలో (Strongest Typhoon Of Year Ravages The Philippines) ఇదే మొదటిసారి. ఇటీవలి సంవత్సరాలలో దేశాన్ని తాకిన అత్యంత ఘోరమైన తుఫానులలో ఇది ఒకటిగా మారిందని వారు చెబుతున్నారు.

ఆర్చిపెలాగోలోని సౌథర్న్‌, సెంట్రల్‌ రీజియన్లలో సుమారు 239 మంది గాయపడ్డారు, మరో 52 మంది గల్లంతయ్యారని చెప్పారు. ఈ మేరకు కోస్తా ప్రాంతాల్లో మొత్తం తుడుచి పెట్టుకుపోయిందని ఫిలిప్పీన్స్‌ రెడ్‌క్రాస్‌ తెలిపింది. దేశవ్యాప్తంగా దాదాపు 8 లక్షల మంది పై తుపాను ప్రభావం పడింది. ఈ తుపాను బీభత్సంతో ఫిలిప్పీన్స్​ కోలుకోలేని స్థితికి చేరింది. కేవలం రెండే రోజుల్లో యావత్​ దేశాన్ని అతలాకుతలం చేసింది. అంతేకాదు ఫిలిప్పీన్స్‌లోని అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

ఒక్క ఏడాదిలోనే విరుచుకుపడిన 50 తుఫాన్లు, తాజాగా ఉగ్రరూపం చూపిస్తోన్న రాయ్, జన జీవనం అస్తవ్యస్తం, ఫిలిప్పీన్స్ దేశంలో ఈ యేడాది సంభవించిన తుఫానుల్లో ఇదే అత్యంత భయంకరమైన సూపర్ టైఫూన్

టైఫూన్ రాయ్ ద్వీ పసమూహంలోని దక్షిణ మరియు మధ్య ప్రాంతాలను ధ్వంసం చేసిన తర్వాత కనీసం 239 మంది గాయపడ్డారు మరియు 52 మంది తప్పిపోయారని అక్కడి పోలీసులు చెబుతున్నారు. సూపర్ టైఫూన్‌గా రాయ్ గురువారం దేశంలోకి దూసుకుపోవడంతో 300,000 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లు మరియు బీచ్ ఫ్రంట్ రిసార్ట్‌లను వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. పైగా సమాచార, రవాణా వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ మేరకు భారీ వర్షాలు, వరదలతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. అంతేకాదు చెట్లు, ఇళ్ల పైకప్పులపై ప్రజలు బిక్కు బిక్కుమంటూ తలదాచుకున్న దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి.

తుఫాను పైకప్పులను కూల్చివేసి, చెట్లను నేలకూల్చింది, కాంక్రీట్ విద్యుత్ స్తంభాలను నేలకూల్చింది, చెక్క ఇళ్ళను ముక్కలు చేసి, గ్రామాలను ముంచెత్తింది. 2013లో సంభవించిన సూపర్ టైఫూన్ హైయాన్‌తో పోటీగా ఈ తుఫాను విరుచుకుపడిందని అక్కడి వాతావరణశాఖ చెబుతోంది. గంటకు 195 కిలోమీటర్లు (120 మైళ్లు) వేగంతో గాలులు వీస్తూ దేశంలోకి దూసుకొచ్చిన తుఫాను తీవ్రతను భరించిన సియార్‌గావ్, దినాగట్ మరియు మిండనావో దీవుల్లో కూడా విస్తృతంగా విధ్వంసం జరిగింది.