Covid cases in UK: యూకేలో కరోనా బీభత్సం, ఒక్కరోజే 2లక్షల కేసులు, రికార్డులు బద్దలు కొడుతున్న కొత్త కేసులు, ఆస్పత్రుల్లో పెరుగుతున్న అడ్మిషన్లు
Coronavirus in TS (Photo Credits: IANS)

Britain January 05:  బ్రిటన్‌లో (Britain) కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారీ కేసులు సరికొత్త రికార్డు స్థాయి(Daily cases on High)కి చేరాయి. దేశంలో ఒకేరోజు రెండు లక్షలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా వెలుగుచూసినప్పటి నుంచి బ్రిటన్‌లో ఒకే రోజులో ఇంత భారీ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవడం ఇదే మొదటిసారి.

యునైటెడ్‌ కింగ్‌డమ్‌(United Kingdom)లో మంగళవారం 2,18,724 మంది కరోనా బారినపడ్డారు. కొత్తగా 48 మంది మరణించడటంతో మొత్తం మృతులు 1,48,941కి పెరిగారు. అదేవిధంగా 14,126 మంది బాధితులు ఇంకా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

COVID In India: కరోనా థర్డ్ వేవ్ ఆందోళన, దేశంలో ఒక్కసారిగా 58,097 కేసులు నమోదు, 534 మంది కోవిడ్‌తో మృతి, 4.18 శాతానికి చేరిన డైలీ పాజిటివిటీ రేటు

యూకే(UK)లో ఇప్పటివరకు 12 ఏండ్ల వయస్సు పైబడినవారిలో 90 శాతానికిపైగా మంది కరోనా వ్యాక్సిన్‌(Corona vaccine) మొదటి డోసు తీసుకున్నారు. అదేవిధంగా సుమారు 82 శాతం మంది రెండు డోసులు వేయించుకున్నారు. భారీగా రోజువారీ కేసులు నమోదవుతున్నప్పటికీ దేశంలో ఇప్పటికిప్పుడే ఆంక్షలు విధించే ఉద్దేశమేదీ లేదని బ్రిటిష్‌ హెల్త్‌ సెక్రెటరీ వెల్లడించారు. అమెరికా లాగా హోం క్వారంటైన్‌ను ఏడు నుంచి ఐదు రోజులకు తగ్గించే ప్రణాళికలేమీ లేవన్నారు.