US Police | Image used for representational purpose (Photo Credits: Twitter)

Georgia, March 17: అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో మారు మోగిపోయింది. దుండగులు అట్లాంటాలోని మసాజ్‌ పార్లర్‌, స్పాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తుండగా చోటు చేసుకున్న కాల్పుల్లో (US Spa Shooting) ఎనిమింది మంది చనిపోయారు. మృతుల్లో ఏడుగురు మహిళలే ఉండగా.. వీరిలో ఆరుగురు ఆసియన్లు ఉన్నారని పోలీసులు అధికారులు తెలిపారు.

కాల్పులకు పాల్పడినట్లు భావిస్తున్న అనుమానితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు.. వుడ్‌స్టాక్‌కు చెందిన రాబర్ట్ ఆరోన్ లాంగ్‌ మంగళవారం అట్లాంటాలో ఉన్న ఓ బ్యూటీ స్పా దగ్గర దొంగతనం చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిపై విచక్షణారహితంగా కాల్పులు ( Massage Parlours in Atlanta and Georgia) జరిపాడు. ఇలా రెండు స్పాలు, ఓ మసాజ్‌ సెంటర్‌ దగ్గర మొత్తం ఎనిమిది మందిపై కాల్పులు (Atlanta Shooting) జరిపాడు.

వీరిలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. కాల్పులకు తెగబడిన రాబర్ట్‌ ఆరన్‌ కోసం గాలించడం ప్రారంభించారు. రాబర్ట్ ఆరోన్ లాంగ్‌ను రాత్రి 8:30 గంటలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పాక్ ప్రధానికి పాలించే సామర్థ్యం లేదు, దేశాన్ని పాలించే పద్ధతి ఇది కాదు, సీసీఐ సమావేశం ఆలస్యంపై ఇమ్రాన్ సర్కారుపై మండిపడిన ఆ దేశ సుప్రీంకోర్టు

అయితే కాల్పులకు గల కారణాలు రాలేదు. మొదట కాల్పులు జరిగిన సమయంలో పోలీసులు దోపిడీగా భావించారు. అనంతరం వాయువ్య ప్రాంతంలోని అక్వర్త్‌ సమీపంలోని యంగ్స్ ఏషియన్ మసాజ్ వద్ద జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించారని చెరోకీ కౌంటీ షెరీఫ్ కార్యాలయానికి చెందిన కెప్టెన్ జే బేకర్ తెలిపారు. మరో వ్యక్తి గాయపడ్డాడని.. ఘటన సాయంత్రం 5 గంటలకు జరిగిందని పేర్కొన్నారు. 5.47గంటల ప్రాంతంలో ఈశాన్య ప్రాంతంలో ఉన్న గోల్డ్‌ స్పా వద్ద జరిపిన కాల్పుల ఘటనలో ముగ్గురు మహిళల మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.