Truong My Lan (Photo Credit: X/@C_NyaKundiH)

Hanoi, April 11: ట్రూంగ్‌ మై లాన్‌.. వియత్నాం (Vietnam)లోని దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరు. ‘వాన్‌ థిన్‌ ఫాట్‌’ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఛైర్మన్‌గా ఉన్న ఆమె దాదాపు రూ.లక్ష కోట్లకు (12.5 బిలియన్‌ డాలర్లు) సంబంధించి బ్యాంకులను మోసం చేసిన కేసులో దోషిగా తేలారు. దీంతో ఆమెకు (Truong My Lan) అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. దేశంలో సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా నిలిచిన ఆమెపై కోర్టు కేసు తీర్పు ఎలా ఉండబోతోందనే విషయంపై వియత్నాం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసింది.

Mozambique Ferry Accident: ఘోర పడవ ప్రమాదం, సముద్రంలో మునిగి 90 మంది మృతి, మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే.. 

ట్రూంగ్‌ మై లాన్‌కు స్థానిక సైగాన్‌ కమర్షియల్‌ బ్యాంకు (SCB)లో దాదాపు 90శాతం వాటా ఉంది. కొన్నేళ్లుగా ఈ బ్యాంకులో ఆమె మోసాలకు పాల్పడ్డారు. 2018 నుంచి 2022 మధ్య 916 నకిలీ దరఖాస్తులు సృష్టించి బ్యాంకు నుంచి 304 ట్రిలియన్‌ డాంగ్‌ (వియత్నాం కరెన్సీ)లు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. అంటే 12.5 బిలియన్‌ డాలర్లకు పైమాటే. 2019-22 మధ్య ఆమె డ్రైవర్‌ బ్యాంకు హెడ్‌క్వార్టర్స్‌ నుంచి 4.4 బిలియన్‌ డాలర్ల నగదును లాన్‌ నివాసానికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. 2022లో ఈ కుంభకోణం బయటపడగా అదే ఏడాది అక్టోబరులో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.