Credit@ Twitter

Tehran, OCTT 26: ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషి’గా (World's dirtiest man) పిలిచే ఇరాన్‌కి చెందిన అమౌ హజీ అనే వ్యక్తి మరణించాడు. 94 ఏండ్ల హజీ (Haji) 6 దశాబ్దాలుగా స్నానం చేయలేదు. ఇరాన్‌లో (Iran) ఫార్స్‌ ప్రావిన్స్‌లోని దేగ్జాహ్‌ గ్రామం లో అమౌ హజీ ఆదివారం మరణించాడని స్థానిక మీడియా పేర్కొన్నది. అనారోగ్యం బారిన పడుతాననే భయంతో హజీ స్నానాన్ని నిరాకరించేవాడని అధికారులు చెబుతున్నారు. అయితే గ్రామస్తులు ఇటీవల ఓసారి అతనికి బలవంతంగా స్నానం చేయించారు. ఇరాన్‌ లోని డెగామ్ గ్రామ శివారులో నివసించే ఇతను...ఒక గుహలాంటి ప్రాంతంలో ఉండేవాడు. దాదాపు 60 సంవత్సరాలుగా స్నానం చేయకుండా ఉన్న అతనికి ఇటీవల కొందరు గ్రామస్తులు బలవంతంగా స్నానం చేయించారు. అప్పటి నుంచి అతను జబ్బుపడ్టట్లు డాక్టర్లు తెలిపారు. సబ్బు  నీరు అంటే అసహ్యించుకునే హజీ 60 సంవత్సరాల నుంచి స్నానం చేయకపోయినప్పటికీ ఎలాంటి అనారోగ్యం పాలవ్వలేదు. అతని ఆరోగ్యం నిక్షేపంగా ఉందని డాక్టర్లు తేల్చారు.

Rishi Sunak's First Speech: ప్రధాని హోదాలో రిషి సునక్ తొలి ప్రసంగం, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న బ్రిటన్‌ను గట్టెక్కించేందుకు కఠిన నిర్ణయాలు తప్పవని సందేశం

అయితే స్నానం చేసిన కొద్దిరోజులకే మరణించడం గమనార్హం. అతను ముళ్ల పందులను వండుకోకుండానే తినేవాడు. మురికి గుంటల్లోని నీటిని తుప్పుపట్టిన డబ్బాల్లో పట్టుకొని తాగేవాడు. ఎండిన పశువుల పశువుల పేడను తన దగ్గరున్న పాత పైపుల్లో పెట్టుకొని పొగతాగేవాడు. ఒకేసారి నాలుగు సిగిరెట్లు తాగేవాడు. అయితే ఒకసారి బలవంతంగా స్నానం చేయించేందుకు తీసుకెళ్తుండగా...మధ్యలోనే వ్యాన్ నుంచి దూకిపారిపోయాడు. ఆ తర్వాత డాక్టర్లు అతన్ని పరీక్షించి ఎలాంటి బ్యాక్టీరియా లేదని తేల్చారు. అయితే పచ్చిమాంసం తినడం వల్ల ట్రైకినోసిస్ అనే బ్యాక్టిరియా మాత్రం అతనిలో కనిపించింది. దీనివల్ల కాస్త ఇన్‌ ఫెక్షన్ కు గురయ్యాడు.

Myanmar Air Strike: మయన్మార్‌లో సైనిక పాలన అరాచకం,  ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న వారిపై మూడు జెట్‌ ఫైటర్లతో 4 బాంబులు, 80 మంది మృతి 

స్నానం గురించి అతనికి ఎవరు ఎన్ని చెప్పినా కూడా పట్టించుకునేవాడు కాదు. అయితే కొద్దిరోజుల క్రితం స్థానిక గ్రామస్తులు అతన్ని బలవంతంగా తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేయించారు. ఇక హజి మరణంతో అత్యంత మురికి వ్యక్తిగా అతని పేరుమీద ఉన్న రికార్డు కనుమరుగైంది. ఇప్పుడు అతని స్థానంలో వారణాసికి చెందిన ఓ వ్యక్తి పేరు రికార్డు ఉంది. వారణాసికి చెందిన కలౌ అనే వ్యక్తి 30 ఏళ్లకు పైగా స్నానం చేయకుండా ఉన్నట్లు స్థానిక మీడియా ప్రచురించింది. దేశం ఎదుర్కుంటున్న అన్ని సమస్యలను రూపుమాపేందుకు తాను అగ్నిస్నానం చేస్తున్నా అంటూ అతను చెప్తున్నాడు.