Chiarman of Mahindra Group, Anand Mahindra (File Photo/ANI)

New Delhi, August 30: టోక్యో పారాలింపిక్స్‌ 2021లో స్వర్ణం సాధించిన భారత మహిళా షూటర్‌ అవని లేఖరాకు పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్‌ మహీంద్రా బంపరాఫర్ ప్రకటించారు.ప్రత్యేక సామర్థ్యాలు ఉన్నవారికి తయారు చేయనున్న తమ తొలి ఎస్‌యూవీని అవనికు (Anand Mahindra Dedicates First SUV ) అందిస్తానని ప్రకటించారు. షూటింగ్‌లో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించి చరిత్ర సృష్టించిన అవనిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

కాగా భారత పారా ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ దీపా మాలిక్ అభ్యర్థన మేరకు ప్రత్యేక ఎస్‌యూవీల తయారీకి (Special Utility Vehicles) మొగ్గు మహీంద్రా గ్రూప్ మొగ్గు చూపింది. ఇదిలా ఉంటే తన లాంటి ప్రత్యేక సామర‍్థ్యం ఉన్న వారికోసం భారతదేశంలో ప్రత్యేక ఎస్‌యూవీలను తయారు చేయమని భారత ఆటోమొబైల్ పరిశ్రమను దీపా మాలిక్ అభ్యర్ణించారు. తనకు ఎస్‌యూవీ నడపడం అంటే చాలా ఇష్టమనీ, ఇలాంటి కార్లలో ప్రత్యేక సీట్లను ఏర్పాటు చేయాలని మహీంద్రా, టాటా మోటార్స్, ఎంజీ ఇండియా లాంటి భారతీయ ఆటోమొబైల్ దిగ్గజాలను కోరారు.

Here's Tweet Updates

ఎవరైనా ప్రత్యేక సీట్‌లతో కూడిన ఎస్‌యూవీని మార్కెట్‌లోకి తీసుకువస్తే, తప్పనిసరిగా కొనుగోలు చేస్తానని ఆమె ప్రకటించారు.ఈ మేరకు ఆమె ఒక వీడియోను షేర్‌ చేశారు. దీపా మాలిక్‌ ట్వీట్‌పై ఆనంద్‌ మహీంద్ర స్పందించారు. ఈ సవాలును స్వీకరించి వారికోసం ఎస్‌యూవీలను తయారీపై దృష్టి పెట్టాలని తన ఉద్యోగి వేలును కోరిన సంగతి తెలిసిందే.

సింధుకు గిఫ్ట్ ఇవ్వమని కోరిన నెటిజన్, బంగారానికి ఎప్పుడో ఇచ్చానని తెలిపిన ఆనంద్ మహీంద్రా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మహీంద్రా రిప్లయి ట్వీట్

ఇక పారా ఒలింపిక్స్‌ అవని సాధించిన ఘనతపై దేశవ్యాప్తంగా అభినందనల వెల్లువ కురుస్తోంది. మరోవైపు తనకు బంగారు పతకం లభించడంపై అవని సంతోషాన్ని ప్రకటించారు. ఈ అనుభూతిని వర్ణించ లేనిదని ప్రపంచం శిఖరానికి ఎదిగిన భావన కలుగుతోందని పేర్కొన్నారు.