రెండోసారి ఒలింపిక్ పతకం కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పీవీ సింధును అభినందిస్తూ పారిశ్రామిక దిగ్గజం మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌పై నెటిజన్లు రీట్వీట్ చేస్తున్నారు. దీనిపై కామెంట్ల కూడా చేస్తున్నారు. ఈ సమయంలో ఓ నెటిజన్ చేసిన కామెంట్.. ఆ ట్వీట్‌కు ఆనంద్ మహేంద్ర రిప్లయ్ ఇవ్వడం వైరల్‌గా మారింది.
సింధును అభినందిస్తూ ఆనంద్ మహీంద్ర చేసిన ట్వీట్‌పై శుభ్ వదేవాల కామెంట్ చేశారు. ‘సింధు అత్యుత్తమ ప్రదర్శనకు థార్ (మహీంద్ర కంపెనీకి చెందిన వాహనం) కానుక’ అని రిప్లయ్ ఇచ్చారు. సింధుకు థార్ కావాలి అనే హ్యాష్‌ట్యాగ్ కూడా క్రియేట్ చేశారు. ఈ కామెంట్‌ను చూసిన ఆనంద్ రిప్లయ్ ఇచ్చాడు. ‘సింధుకు ఇంతకుముందే థార్ వాహనం ఉంది’ అని మహేంద్ర తెలిపారు.
రియో ఒలింపిక్స్‌లో విజయం సాధించినప్పుడు సింధుకు థార్ వాహనం అందించిన విషయాన్ని గుర్తు చేస్తూ దానికి సంబంధించిన ఫొటోను కూడా పంచుకున్నారు. సాక్షి మాలిక్‌తో కలిసి సింధు థార్ ఎస్‌యూవీ వాహనంపై తిరుగుతున్న ఫొటోతో ఆ నెటిజన్‌కు బదులిచ్చారు.
She already has one in her garage… https://t.co/Be6g9gIcYh pic.twitter.com/XUtIPBRrmi
— anand mahindra (@anandmahindra) August 1, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)