ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata motors) మరోసారి వాహనాల ధరల పెంపునకు (Price hike) సిద్ధమైంది. వాణిజ్య వాహనాల ధరలను జూలై నెల పెంచనున్నట్లు నుంచి బుధవారం ప్రకటించింది. ఎక్స్‌షోరూం ధరలపై 2శాతం వరకు పెంపు ఉంటుందని పేర్కొంది. కొత్త ధరలు జులై 1 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ధరల పెంపు మొత్తం వాణిజ్య వాహనాల శ్రేణికి వర్తిస్తుంది. వ్యక్తిగత మోడల్, వేరియంట్‌ను బట్టి మారుతుందని టాటా మోటార్స్ ఒక ప్రకటనలో తెలిపింది. టాటా నెక్సాన్ నుంచి ఎంట్రీ-లెవల్ వేరియంట్లు, ధర రూ. 7.49 లక్షలు నుంచి ప్రారంభం, ఫీచర్లు ఇవిగో..
నిర్వహణ వ్యయాలు, ముడి సరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాటా మోటార్స్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. నిర్దిష్ట మోడల్, వేరియంట్ ఆధారంగా ధరల పెంపులో మార్పు ఉంటుంది. అయితే కంపెనీ వాణిజ్య వాహన ధరల్ని పెంచడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి. మరోవైపు కంపెనీ టాటా మోటార్స్‌ను రెండు వేర్వేరు నమోదిత సంస్థలుగా ప్రకటించింది. ఇకపై కమర్షియల్ వాహన విభాగం, దాని పెట్టుబడులు ఓ సంస్థగా ఉంటాయి. ప్యాసింజర్, ఎలక్ట్రిక్, జాగ్వార్ ల్యాండ్ రోవర్‌తో కూడిన ప్రయాణికుల వాహన విభాగం, దాని పెట్టుబడులు ఇంకో సంస్థగా ఉండనున్నాయి.టాటా మోటార్స్ భారతదేశంలో ట్రక్కులు మరియు బస్సులతో సహా వాణిజ్య వాహనాల తయారీలో అగ్రగామిగా ఉంది.