Challa Sreenivasulu Setty (Credits: X)

Newdelhi, June 30: భారత బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నూతన చైర్మన్‌ (SBI Chairman) గా ఉమ్మడి పాలమూరుకు చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టి (సీఎస్ శెట్టి) (CH Shetty) ఎంపికయ్యారు. ప్రస్తుత ఎస్బీఐ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్‌ గా ఉన్న చల్లా శ్రీనివాసులు శెట్టిని చైర్మన్‌గా ఆర్థిక సేవల సంస్థ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) సిఫారస్ చేసింది. ప్రస్తుతం సంస్థ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా ఈ ఏఢాది ఆగస్టు 28న పదవీ విరమణ చేయబోతున్నారు.

భారత్ జగజ్జేతగా నిలిచిన శుభవేళ.. భావోద్వేగ దృశ్యాలు.. హార్దిక్ పాండ్యాను ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్న రోహిత్ శ‌ర్మ.. వీడియో ఇదిగో

ఎవరీ శెట్టి?

బోగులాంబ గద్వాల్ జిల్లాలోని మానవపాడు మండలంలోని పెద్ద పోతులపాడు గ్రామంలో శెట్టి పదో తరగతి వరకూ చదువుకున్నారు. ఆ తరువాత గద్వాల్‌ లో ఉన్నత చదువులు చదివారు. రాజేంద్ర నగర్ వ్యవసాయ యూనివర్సిటీలో నుంచి బీఏ అగ్రికల్చర్‌లో పట్టా పొందారు. ఎస్బీఐలో 1988లో ప్రొబేషనరీ ఆఫీసర్ స్థాయిలో కెరీయర్ ప్రారంభించిన శెట్టి, బ్యాంకింగ్ రంగంలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్నది.

భారత్ విశ్వవిజేతగా నిలిచిన శుభవేళ.. బార్బడోస్ మైదానంలోని గరికను తిన్న రోహిత్ శ‌ర్మ.. వీడియో ఇదిగో