RBI and Paytm (Photo-File Image)

Newdelhi, Feb 2: ఆర్బీఐ (RBI) ఆంక్షలతో ఆందోళనలో ఉన్న పేటీఎం పేమెంట్ బ్యాంక్ (Paytm Payments Bank) కస్టమర్లకు సదరు సంస్థ యాజమాన్యం తాజాగా భరోసా కల్పించే ప్రయత్నం చేసింది. కస్టమర్ల డబ్బు తమ వద్ద భద్రంగా ఉందంటూ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 29 తరువాత కస్టమర్లు తమ అకౌంట్లు, వాలెట్లలో డబ్బులు జమ చేసేందుకు అనుమతి ఉండదని పేర్కొంది. అయితే, కస్టమర్లు ఎప్పటిలాగే డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చని స్పష్టం చేసింది. కస్టమర్ల డబ్బు తమ వద్ద భద్రంగా ఉందని, ఏ సహాయం కావాలన్న తాము 24 గంటలు అందుబాటులో ఉంటారని పేర్కొంది.

Ayodhya Ram Mandhir: 11 రోజుల్లో 25 లక్షల మంది దర్శనం.. రూ.11.5 కోట్ల ఆదాయం.. ఇవీ అయోధ్య రామాలయం లెక్కలు..

అసలేం జరిగిందంటే?

పేటీఎం పేమెంట్ బ్యాంకు నిబంధనలు ఉల్లంఘించినట్టు ఆర్బీఐ గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చ్ నెల నుంచి కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని పేటీఎం పేమెంట్స్ బ్యాంకును ఆర్బీఐ ఆదేశించింది. నగదు బదిలీ సేవలు, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్‌ ను కూడా నిలిపివేయాలని పేర్కొంది.  ఈ నేపథ్యంలో కస్టమర్ల సందేహాలను నివృత్తి చేసేందుకు సంస్థ శుక్రవారం పై ప్రకటన చేసింది.

TTD Srivari Hundi: వంద కోట్ల మార్క్‌ దాటిన శ్రీవారి హుండీ ఆదాయం.. వరుసగా 23వ నెలలోనూ రికార్డ్