Mumbai, March 16: యెస్ బ్యాంక్ సంక్షోభాన్ని (YES Bank Crisis) పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం మరియు భారతీయ రిజర్వ్ బ్యాంక్ తగిన చర్యలు తీసుకుంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das) పేర్కొన్నారు. యెస్ బ్యాంకుపై ఉన్న మారటోరియంను బుధవారం 6 గంటల నుంచి ఎత్తివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆ తర్వాత డిపాజిటర్లు తమ డబ్బును కావాల్సినట్లుగా ఉపసంహరించుకోవచ్చునని ఆయన స్పష్టం చేశారు. యెస్ బ్యాంకులో ఉన్న ప్రజల సొమ్ము పూర్తి భద్రంగా ఉందనీ, ఖాతాదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శక్తికాంత దాస్ భరోసానిచ్చారు.
సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ, " YES బ్యాంక్ డిపాజిటర్లకు మీడియా ద్వారా ఒక తెలియజేయాలనుకుంటున్నాను, మీ డబ్బు పూర్తిగా సురక్షితం, దీనిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు. కేంద్రం మరియు ఆర్బీఐ కలిసి సత్వర చర్యలు తీసుకుంటున్నాము. ఇందులో భాగంగా యెస్ బ్యాంకుపై ఉన్న తాత్కాలిక నిషేధం ఎత్తివేత బుధవారం సాయంత్రం 6 గంటలకు ఉంటుంది" అని పేర్కొన్నారు. యెస్ బ్యాంకులో నగదు కొరత ఉంటే, ఆర్బీఐ అందుకు తగిన సహాకారం అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఇక మార్చి 26 నుంచి యెస్ బ్యాంకుకు కొత్త బోర్డ్ బాధ్యతలు తీసుకుంటుందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. ఒక ప్రైవేటు రంగ బ్యాంకు పునరుజ్జీవనం కోసం ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం మొదటిసారిగా జరిగిందని ఆయన వెల్లడించారు.
ఇక YES బ్యాంక్ విషయాన్ని పక్కన పెడితో, భారత ఆర్థిక వ్యవస్థపై కరోనావైరస్ ప్రభావంపై కూడా శక్తికాంత దాస్ మాట్లాడారు. "ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చ్రయలు తీసుకుంటుందని వెల్లడించారు. భారతదేశంపై COVID-19 ప్రభావం నేరుగా పడుతోంది. వాణిజ్య రంగంలో అనేక రకాలుగా దీని ప్రభావం ఉంటుందని ఆయన తెలిపారు. చైనా ఆర్థిక వ్యవస్థపై మరింత ప్రభాం ఉంటుందని దాస్ అన్నారు. యెస్ బ్యాంక్ నుంచి వేల కోట్ల రూపాయలు రుణాలు పొందిన రిలయన్స్ గ్రూప్, అంబానీకి ఈడీ సమన్లు
అలాగే కరోనావైరస్ రెండో దశ ప్రభావం ప్రపంచ ఆర్థిక మందగమనంపై కూడా ప్రభావం చూపుతుంది. ఆ క్రమంలో భారత ఆర్థిక వృద్ధిపై కూడా ఎంతో కొంత కోవిడ్ 19 ప్రభావం ఉంటుందని చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ అత్యవసర ప్రెస్ మీట్ పెట్టడంతో వడ్డీ రేట్ల తగ్గింపు, జీఎస్టీ చెల్లింపులు తదితర కీలక అంశాలపై గవర్నర్ ఏదైనా ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ ఈరోజు అలాంటి ప్రకటనలేమి చేయలేదు. ఏప్రిల్ 03న జరిగే మానిటరీ పాలసీ మీటింగ్ తర్వాత అలాంటి ప్రకటనలు ఉండవచ్చునని సమాచారం.