Hyderabad, Nov 12: ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) సరి కొత్త సదుపాయాన్ని తీసుకువచ్చింది. ఫుడ్ రెస్క్యూ అనే ఈ ఫీచర్ తో (Food Rescue Feature) కస్టమర్లు తక్కువ ధరకు ఇంకా చెప్పాలంటే సగం కంటే తక్కువ ధరకే ఫుడ్ ను కొనుగోలు చేయవచ్చు. రద్దు చేసిన ఆర్డర్ల ఆహారాన్ని వృధా చేయడాన్ని నిరోధించేందుకు జొమాటో ఈ ప్రత్యేక సదుపాయాన్ని ప్రారంభించింది. ఈ కొత్త ఫుడ్ రెస్క్యూ ఫీచర్ సదుపాయం ద్వారా కస్టమర్లు చాలా తక్కువ ధరలకు ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు.
ఆలయంలో ప్రదక్షిణాలు చేస్తున్న వ్యక్తికి గుండెపోటు.. స్పాట్ లోనే మృతి.. కేపీహెచ్ బీలో ఘటన (వీడియో)
ఎందుకు?
ఫుడ్ క్యాన్సిల్ చేస్తే ‘నో రిఫండ్’ విధానం ఉన్నప్పటికీ వివిధ కారణాలతో నెలకు నాలుగు లక్షల కంటే ఎక్కువ ఆర్డర్లను కస్టమర్లు రద్దు చేస్తున్నారని జొమాటో సహ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ తెలిపారు. ఇది తమకు ఆందోళన కలిగించే అంశమని, ఆహారాన్ని వృధా చేయడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అరికట్టాలని అనుకున్నామని, అందుకే ఫుడ్ రెస్క్యూ ఫీచర్‌ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.