Sarika (Photo Wikimedia Commons)

కమల్ హాసన్ మాజీ భార్య, శుృతి హాసన్‌ తల్లి సారిక లాక్‌డౌన్‌ సమయంలో కేవలం రూ. 3వేల (Earning Less Than Rs 3000) కోసం ఆమె థియేటర్‌ ఆర్టిస్టులతో​ కలిసి వర్క్‌ చేశానని చెప్పడం అందరిని షాక్‌కు గురిచేస్తోంది. కమల్‌ హాసన్‌ను పెళ్లి చేసుకున్న అనంతరం సినిమాలకు గుడ్‌బై చెప్పి చెన్నై వెళ్లిపోయింది. అయితే అది కొద్ది రోజులకే విడాకులకు దారి తీసింది. విడాకుల అనంతరం తిరిగి ముంబైకి వచ్చిన ఆమె (Actor Kamal Haasan’s Ex-Wife Sarika) మళ్లీ నటిగా బిజీ అయిపోయింది.

ఈ నేపథ్యంలో ఆమెజాన్‌ ప్రైం ‘మోడ్రన్‌ లవ్‌ ముంబై’ అనే ఆంథాలజీలోని ‘మై బ్యూటీఫుల్‌ రింకిల్స్‌’ అనే పార్ట్‌లో నటించింది. ఇందులో ఆమె నటనకు గాను ప్రశంసలు అందుకుంటోంది. ఈ క్రమంలో ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో కరోనా కాలంలో తాను ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలపై నొరు విప్పింది సారిక. ‘కమల్‌తో విడాకుల అనంతరం తిరిగి ముంబై వచ్చాయి. మళ్లీ నటిగా చిన్న చిన్న రోల్స్‌ చేయడం ప్రారంభించాను. అలా ఓ రోజు చూస్తే లైఫ్‌ రోటీన్‌గా అనిపించింది.

వీడియో ఇదిగో.. సినీ నటి కరాటే కల్యాణి VS యూట్యూబర్‌ శ్రీకాంత్‌రెడ్డి, రోడ్డు మీద బట్టలు చినిగేలా కొట్టుకున్నారు

ఉదయం లేవడం వర్క్‌కు వెళ్లడం.. మళ్లీ రాత్రికి పడుకోవడం. కొత్తగా ఏం అనిపించడం లేదు. దీంతో ఒక ఏడాది పాటు నటనకు బ్రేక్‌ తీసుకున్నా. అదే సమయంలో కరోనా, లాక్‌డౌన్‌లు వచ్చాయి. దీంతో అయిదేళ్లు ఈజీగా గడిచిపోయాయి. ఈ పాండమిక్‌ సమయంలో నా దగ్గర ఉన్న సేవింగ్స్‌ పూర్తిగా అయిపోయాయి. ఏం చేయాలో తెలియదు. దీంతో థియేటర్‌ ఆర్టిస్టులతో కలిసి వర్క్‌ చేశా. కానీ వారు కేవలం 2000 నుంచి 2700 వరకు మాత్రమే చెల్లించేవారు. దీంతో తిరిగి సినిమాల్లో నటించడమే మంచిదని నిర్ణయించుకున్నా’ అంటూ సారిక చెప్పుకొచ్చింది.

దీంతో ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాల్లో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ఓ స్టార్‌ హీరోయిన్‌ తల్లి అయ్యిండి కూడా ఆమెకు ఇలాంటి పరిస్థితి రావడం ఏంటని అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా కమల్‌-సారికలు కొంతకాలం రిలేషన్‌లో ఉన్న అనంతరం 1998లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు శృతి హాసన్‌, అక్షర హాసన్‌లు జన్మించారు. ఈ క్రమంలో 16 ఏళ్ల పాటు కలిసి ఉన్న కమల్‌-సారికలు 2004లో విడాకులు తీసుకున్నారు.