Sonu Sood on AP Villagers: ఏపీకి రానున్న సోనూ సూద్, ఆ రెండు గ్రామాల ప్రజలను చూడాలని ఉందంటూ ట్వీట్, 20 వేల మంది వలస కార్మికులకు నోయిడాలో ఆశ్రయం కల్పించనున్న రియల్ హీరో
Sonu Sood inspired AP villagers (Photo-Twitter)

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో (Vizianagaram) తమ ఊరి రోడ్లను తామే నిర్మించుకున్న రెండు గ్రామాల ప్రజలపై సోనూ సూద్ ప్రశంసల వర్షం కురిపించారు. అందరూ సోనూ భాయ్ ని పొగిడితే ఆయన మాత్రం ఏపీలోని రెండు గ్రామాల ప్రజలను ఆకాశానికి ఎత్తేశాడు. మీరు జాతి మొత్తానికి స్ఫూర్తిగా నిలిచారు. వెల్‌డన్‌ హీరోస్‌’ ’అంటూ ట్విటర్‌ వేదికగా కొనియాడారు. త్వరలోనే మీ ఊరికి వస్తానని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

వివరాల్లోకెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో ఏఓబీలో గల గిరిశిఖర కొదమ పంచాయతీ చింతామలలో (Chintamala & Kodama villages) సుమారు 150 కుటుంబాలు జీవిస్తున్నాయి. గ్రామానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశా రాష్ట్రంలో భారీ సంత జరుగుతూ ఉంటుంది. అక్కడికి వెళ్లాలన్నా, మరే ఇతర అవసరాల కోసమైనా ఈ పంచాయతీ గిరిజనులు సబకుమరి జంక్షన్‌ దాటాల్సి ఉంటుంది. అయితే జంక్షన్‌ వరకు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం వేసిన బీటీ రోడ్డు మాత్రమే ఉంది. అయితే దాటేందుకు రోడ్డు వేయాల్సిందిగా దశాబ్దాల తరబడి అర్జీలు పెట్టుకున్నా అవి కార్యరూపం దాల్చలేదు. సోనూసూద్ సాయం వెనుక కథ ఏంటి? ట్రాక్టర్ తీసుకున్న రైతు ఏమంటున్నారు, సోనూసూద్ గొప్ప మనసుపై సోషల్ మీడియా వేదికగా పొగడ్తల వర్షం

దీంతో గిరిజనులు తమ సమస్యను తామే తీర్చుకునేందుకు నడుం బిగించారు. సబకుమరి జంక్షన్‌ వరకు రోడ్డు నిర్మాణానికై చింతామల గ్రామస్తులు ఇంటికి రెండు వేల చొప్పున చందాలు సేకరించారు. వాటితో రెండు ప్రొక్లెయిన్లను రప్పించి కొండను తవ్వించి ఘాట్‌ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఇక గతంలోనే పగులుచెన్నేరు గ్రామస్తులు పట్టుచిన్నేరు నుంచి తమ గ్రామానికి శ్రమదానంతో మట్టి రోడ్డు వేసుకున్నారు. ఈ విషయాన్ని ఓ నెటిజన్‌ సోనూసూద్‌ దృష్టికి తీసుకువెళ్లగా గిరిజనులపై ప్రశంసలు (Sonu Sood inspires 2 Andhra villages) కురిపించారు. నిసర్గ తుఫాన్ కల్లోలం, 28 వేల మందికి సాయం చేసిన సోనూసూద్‌, వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు పంపేందుకు కోట్లు ఖర్చు పెట్టిన సోనూ భాయ్

sonu sood Tweets

లాక్‌డౌన్‌లో వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చడంతో మొదలైన సోనూ దాతృత్వ పరంపర నేటికీ అప్రతిహంగా కొనసాగుతోంది. మరోసారి వలస కార్మికులపట్ల తనకున్న ఔదార్యాన్ని మరోసారి చాటుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఇప్పటికే పలు రైళ్లు, బస్సులు ఇతర రవాణా వ్యవస్థలను ఏర్పాటు చేసిన సోనూసూద్‌ తాజాగా 20 వేల మందికి ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఆశ్రయం కల్పించనున్నట్లు సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ద్వారా ప్రకటించారు.

sonu sood Tweet

20 వేల మంది వలస కార్మికులకు వసతి, గార్మెంట్‌ ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలూ కల్పిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రవాసీ రోజ్‌గార్‌ ద్వారా ఈ మంచి పని కోసం అందరం కష్టపడ్డామని, ఎన్‌ఏఈసీ అధ్యక్షుడు లలిత్‌ ఠుక్రాల్‌ ఎంతో సాయం చేశారని, కార్మికులందరికీ ఆరోగ్యకరమైన వాతావరణంలో వసతి కల్పిస్తామని సోనూసూద్‌ హామీ ఇచ్చారు. లాక్‌డౌన్‌తో ఇబ్బందుల పడుతున్న వలస కార్మికుల సాయం కోసం సోనూసూద్‌ ఓ టోల్‌ ఫ్రీ నంబరు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అవసరమైన వారికి ఉద్యోగాలు కల్పించేందుకు ఆయన ఇటీవల ఒక స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషన్‌ను కూడా ప్రారంభించారు.