 
                                                                 రెండో భర్తపై నటి రాధ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండో భర్త వసంత రాజు తనని హింసిస్తున్నాడంటూ గత ఏప్రిల్ నెలలో స్థానిక విరుగంబాక్కం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. అయితే తాజాగా మరోసారి రెండో భర్తపై (Vasantharaja) ఫిర్యాదు చేశారు. మొదట చేసిన ఫిర్యాదులో తనపై అనుమానం పెంచుకున్నారని, కొట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అయితే ఆ తరువాత ఇద్దరు సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకుని కలిసి జీవిస్తున్నారు.
అయితే శనివారం మరోసారి భర్తపై స్థానిక వరంగమలై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు (actress Radha files a police complaint) చేశారు. తన భర్త, ఆయన మిత్రులతో కలిసి బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. తన భర్తతో పాటు అతని మిత్రులైన సబ్ ఇన్‌స్పెక్టర్ భారతి, ఇళంవరుదిలపై చర్యలు తీసుకోవాలని రాధ పోలీసులను (Virugambakkam police station) కోరారు. తన ప్రవర్తనను అనుమానిస్తూ వేధించడమే కాకుండా, హత్య చేస్తానని బెదిరిస్తున్నారంటూ అడయార్ సెంట్‌థామస్ మౌంట్ జాయింట్ కమిషనర్ నరేంద్రన్ నాయర్‌కు ఆమె శనివారం ఫిర్యాదు చేసింది.
కాగా సుందరా ట్రావెల్స్, హడావిడి, గేమ్ తదితర చిత్రాల్లో రాధ కథానాయకిగా నటించారు. ఆ తరువాత సినీ అవకాశాలు రాలేదు. దీంతో ఒక నిర్మాతను పెళ్ళి చేసుకుని కొంతకాలం సంసారజీవితం గడిపింది. ఆ తర్వాత వారిమధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుని కొడుకు, తల్లితో కలిసి జీవిస్తున్నారు. కొద్ది నెలల క్రితం ఎన్నూర్ పోలీస్‌స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ వసంత రాజాను రెండో వివాహం చేసుకున్నారు. వసంత రాజాకు కూడా ఇదివరకే పెళ్లి అయింది. ఆయనకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
