Aryan Khan Drugs Case: 4 ఏళ్ళ నుంచి డ్రగ్స్ మత్తులో ఉన్నా, యూకే, దుబాయ్‌, ఇతర దేశాల్లో ఉన్నప్పుడు కూడా డ్రగ్స్‌ తీసుకున్నా, ఎన్‌సీబీ అధికారుల విచారణలో ఆర్యన్ ఖాన్
Aryan Khan being taken to court by NCB officials in connection with the drugs case. (PTI Photo)

ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్‌లో రేవ్‌ పార్టీ జరుగుతుందని సమాచారం అందుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ దాడి చేసిన సంగతి తెలిసిందే. డ్రగ్స్‌ కేసులో (Aryan Khan Drugs Case) షారుక్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్‌తోపాటు మొత్తం 8మందిని ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేసి విచారించారు. అయితే కస్టడీలో ఆర్యన్‌ ఖాన్‌ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

ఆర్యన్‌ నాలుగేళ్లుగా డ్రగ్స్‌ (Aryan Khan was consuming drugs for 4 years) తీసుకుంటున్నట్లు ఎన్‌సీబీకి తెలిపాడు. అతను యూకే, దుబాయ్‌, ఇతర దేశాల్లో ఉన్నప్పుడు కూడా డ్రగ్స్‌ తీసుకున్నట్లు చెప్పాడు. అయితే అంతకుముందు షారుక్‌ ఖాన్‌ కస్టడీలో ఉన్న తన కుమారుడితో రెండు నిమిషాల పాటు మాట్లాడి అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నాడు. కాగా ఆర్యన్‌ ఎన్‌సీబీ కస్టడీ నేటితో ముగియనుంది. విచారణ సమయంలో అతను కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నట్లు సమాచారం.

ఆర్యన్‌పై ఎన్సీబీ అధికారులు సెక్షన్‌ 8C, 20B, 27కింద కేసుల నమోదు చేశారు. అయితే ఆ సెక్షన్లు అన్నీ బెయిలబుల్ అని.. తక్షణమే బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు లాయర్ సతీశ్ మనీష్ పాండే కోర్టును కోరారు. అయితే కేసులో పూర్తి వివరాల కోసం ఆర్యన్ సహా ముగ్గురిని విచారించాల్సి ఉందని ఎన్సీబీ వాదించింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఎన్సీబీతో ఏకీభవించింది. ఆర్యన్‌ను ఒకరోజు కస్టడీకి ఇచ్చిన న్యాయస్థానం.. మరో ఇద్దరికి రెండు రోజులు కస్టడీకి ఇచ్చింది.

ముంబై రేవ్ పార్టీలో సంచలన విషయాలు వెలుగులోకి, ఎన్సీబీ అదుపులో షారూఖ్ ఖాన్ కొడుకు, మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న అధికారులు

1985 నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ యాక్ట్ లోని 8(సి) సెక్షన్ కింద ఆర్యన్ ను అరెస్టు చేసినట్లు ఎన్సీబీ తెలిపింది. మాదక ద్రవ్యాలను ఉత్పత్తి చేసినా, తయారు చేసినా, కలిగి ఉన్నా, విక్రయించినా, కొనుగోలు చేసినా, రవాణా చేసినా, నిల్వ చేసినా, వినియోగించినా, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్టానికి దిగుమతి చేసినా, ఎగుమతి చేసినా, దేశం నుంచి బయటికి ఎగుమతి చేసినా, బయటి నుంచి దేశంలోకి దిగుమతి చేసినా అది శిక్షార్హమైన నేరమని ఈ చట్టం స్పష్టం చేస్తోంది.

ఈ చట్టాన్ని ఉల్లంఘించినవారికి ఆరు నెలల వరకూ కఠిన కారాగార శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. ఇక క్రూయిజ్ పైన ఎన్ సీబీ అధికారులు చేసిన దాడిలో 13 గ్రాముల కొకైన్, అయిదు గ్రామలు ఎండీ, 21 గ్రాముల చరస్, ఎండీఎంఏ, లక్షా 33వేల నగదు దొరికినట్టు అధికారులు కోర్టులో చెప్పారు. పట్టుపడిన డ్రగ్స్ విలువ 5 కోట్ల వరకూ ఉంటుంది. 1985 నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ యాక్ట్ ఎన్‌డీపీఎస్ సెక్షన్ 8(సి), 20 (బి), 27, 35 సెక్షన్ల కింద ఆర్యన్‌పై కేసులు నమోదయ్యాయి. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే.. ఆరు నెలల వరకు కఠిన జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.

ముంబై తీరంలో రేవ్ పార్టీ భగ్నం, భారీ స్థాయిలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న ఎన్సీబీ, పలువురు అరెస్ట్, అరెస్ట్ అయిన వారిలో ప్రముఖ బాలీవుడ్ హీరో కుమారుడు

ఇక NDPS యాక్ట్ సెక్షన్ 20(బి) ప్రకారం గంజాయిని కలిగి ఉండటం శిక్షార్హమైన నేరం. నిబంధనలకు విరుద్ధంగా గంజాయి రవాణా చేయడం నేరం. గంజాయి వాడితే పదేళ్ల వరకు పొడిగించే కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారు. NDPS యాక్ట్ సెక్షన్ 27 ప్రకారం మత్తుమందు తీసుకోవడం నేరం. ఏడాది వరకు జైలు శిక్ష, రూ. 20,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది.