Mumbai: ముంబై తీరంలో రేవ్ పార్టీ భగ్నం, భారీ స్థాయిలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న ఎన్సీబీ, పలువురు అరెస్ట్, అరెస్ట్ అయిన వారిలో ప్రముఖ బాలీవుడ్ హీరో కుమారుడు
Narcotics Control Bureau (Photo Credits: IANS)

Mumbai, Oct 3: డ్రగ్స్‌కు సంబంధించిన కేసుల్లో సినీ రంగానికి చెందిన ప్రముఖులపై కేసులు నమోదు అవ్వడం తెలిసిందే. తాజాగా అటువంటిదే ముంబై తీరంలో జరిగింది. ముంబయి శివారులో జరిగిన ఓ రేవ్‌ పార్టీపై ఎన్సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో) అధికారులు దాడులు (NCB Raids Rave Party) జరిపారు. తీరంలోని ముంబై- గోవా క్రూజ్‌ షిప్‌లో (Mumbai-Goa Cruise Ship) ఏర్పాటు చేసిన రేవ్‌ పార్టీలో మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారంటూ సమాచారం రావడంతో శనివారం అర్ధరాత్రి తనిఖీలు చేశారు.

పార్టీలో మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించిన ఎన్సీబీ అధికారులు అధిక మొత్తంలో కొకైన్‌, ఎండీని స్వాధీనం చేసుకున్నారు. పలువురు యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఎన్సీబీ బృందం అదుపులోకి తీసుకున్న వారిలో బాలీవుడ్‌కు చెందిన ఓ సూపర్‌స్టార్‌ తనయుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం వారిని ముంబయికి తీసుకురానున్నారు. ఈ వార్తలతో బీటౌన్‌లో మరోసారి డ్రగ్స్ వాడకం చర్చనీయాంశంగా మారింది.

డ్రగ్స్ కొనుగోలు చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ప్రముఖ టీవీ నటి ప్రీతికా చౌహాన్,‌ ఫైజల్‌ని అరెస్ట్ చేసిన ఎన్‌సీబీ అధికారులు

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB)కు ఓ షిప్‌లో రేవ్‌ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందింది. ముంబై జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే తన బృందంతో కలిసి సముద్రం మధ్య క్రూయిజ్‌ షిప్‌లో రేవ్‌ పార్టీపై దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నామని ఎన్‌సీబీ అధికారి తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారిలో హర్యానా, ఢిల్లీకి చెందిన ఇద్దరు డ్రగ్ పెడ్లర్లు ఉన్నట్లు తెలుస్తోంది. 7 గంటల సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత స్టార్‌ హీరో కొడుకుతో పాటు 10 మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.

కన్నడ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం, నటి సంజన ఇంట్లో పోలీసులు సోదాలు, కేసులో విచారణను వేగవంతం చేసిన బెంగుళూరు సీసీబీ

అయితే ఇంతకుమందు కూడా ఇలాగే సైకోట్రోపిక్ పదార్థాలను కలిగి ఉన్నాడనే ఆరోపణలపై బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ప్రియురాలి సోదరుడు అగిసిలాస్ డెమెట్రియాడ్స్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో రియా చక్రవర్తి, దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ సహా అనేక ఇతర బాలీవుడ్ ప్రముఖులను ఫెడరల్ యాంటీ-నార్కోటిక్స్ ఏజెన్సీ విచారించింది.