Prabhas

Hyderabad, April 21: గ్లోబల్ స్టార్ (Global star), డార్లింగ్ ప్రభాస్ (Prabhas) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఇన్ స్టా (Insta) ఫాలోవర్స్ సంఖ్య 9.4 మిలియన్స్ గా ఉంది. కానీ డార్లింగ్ మాత్రం కేవలం 15 మందినే ఫాలో అవుతున్నారు. ఇందులో ఎక్కువమంది ప్రభాస్ తన సినిమాలకు తనతోపాటు పనిచేసివారే కావడం గమనార్హం. టాలీవుడ్ హీరోలను ఏ ఒక్కరిని డార్లింగ్ ఫాలోకావడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ కే, సలార్ చిత్రీకరణలలో బిజీగా ఉన్నారు. ఇక ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఆదిపురుష్ మూవీ జూన్ 16న ఆడియన్స్ ముందుకు రానుంది. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. ఆయన కెరీర్లో వస్తోన్న మొదటి మైథాలాజికల్ చిత్రం కావడంతో ఈ సినిమా కోసం యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Twitter Blue Tick: ట్విట్టర్ బ్లూ టిక్ కోల్పోయిన విరాట్, సమంత, షారుఖ్, జగన్, పవన్ కల్యాణ్.. కారణం ఇదే!

జాబితా ఇదే

  1. దివంగత హీరో కృష్ణంరాజు
  2. డైరెక్టర్ సందీప్ వంగా
  3. ఆదిపురుష్ ఫేమ్ సన్నీ సింగ్
  4. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్
  5. ఫిల్మ్ యాక్షన్ యూనిట్ ఎడిటర్ DB బ్రాకమోంటెస్
  6. డైరెక్టర్ నాగ్ అశ్విన్
  7. డైరెక్టర్ రాధాకృష్ణ
  8. శ్రుతి హాసన్
  9. అమితాబ్ బచ్చన్
  10. డైరెక్టర్ ఓంరౌత్
  11. దీపికా పదుకొణే
  12. నటి భాగ్య శ్రీ
  13. పూజా హెగ్డే
  14. శ్రద్ధా కపూర్
  15. సాహో డైరెక్టర్ సుజిత్

Sumitra Pampana: ప్రముఖ టీవీ నటి సుమిత్ర ఇంట్లో భారీ చోరీ.. 1.2 కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్లిన దొంగలు.. ఇద్దరు వ్యక్తులు చోరీకి పాల్పడినట్టు ప్రాథమికంగా గుర్తింపు