Happy birthday Nandamuri Balakrishna (Photo-Twitter)

Hyderabad, June 10: హైదరాబాద్‌లోని బసవతారకం ఆసుపత్రిలో సినీనటుడు, టీడీపీ నేత బాలకృష్ణ తన 60వ పుట్టినరోజు వేడుకను (Happy birthday Nandamuri Balakrishna) ఘనంగా జరుపుకున్నారు. చిన్న పిల్లలతో కలిసి ఆయన కేక్‌ కట్ చేశారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు, సిబ్బందికి నిత్యావసరాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ (Nandamuri Balakrishna) మాట్లాడుతూ...ఆసుపత్రి సిబ్బంది అందరూ అంకిత భావంతో పనిచేస్తున్నారని అన్నారు. వారు గొప్ప సేవలు అందిస్తున్నారని కొనియాడారు. తెలంగాణలో సినిమా షూటింగ్‌లకు అనుమతి, ఫైలుపై సంతకం చేసిన సీఎం కేసీఆర్, ధియేటర్లు ప్రారంభించడానికి అనుమతి నిరాకరించిన తెలంగాణ సర్కారు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో అందరూ సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని చెప్పారు. త్వరలోనే కరోనా అంతమొందాలని బాలకృష్ణ ఆశించారు. వర్షాకాలం నేపథ్యంలో వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ప్రజల ఆరోగ్యం ప్రజల చేతుల్లోనే, వారు తీసుకునే జాగ్రత్తలపైనే ఆధారపడి ఉందని తెలిపారు. బాలకృష్ణ పుట్టిన రోజు (Happy Birthday Balayya) సంధర్భంగా పలువురు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

Here's N Chandrababu Naidu Tweet

Here's Mohan Babu Tweet

నా సోదరుని కుమారుడు నందమూరి బాలకృష్ణ 100 సంవత్సరాలు అష్ట ఐశ్వర్య ఆయురారోగ్యములతో నిండు నూరేళ్ళు పుట్టిన రోజులు జరుపుకోవాలని నా హృదయపూర్వకముగా షిరిడీ సాయినాథుని కోరుకుంటున్నాను" అంటూ మోహన్ బాబు ట్వీట్ చేశారు. దీన్ని నారా బ్రాహ్మణి సైతం రీట్వీట్ చేశారు.

Here's Jay Galla Tweet

Here's Mahesh Babu Tweet

ఇదే సమయంలో "పాత్ర కోసం ఎంతటి సాహసం చేయడానికైనా వెనకాడని నందమూరి నట సింహం, 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భముగా బాలయ్య బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ, తెలుగు వారి అభినందనలు పొందుతూ, మీరు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను" అంటూ గల్లా జయదేవ్ పెట్టిన ట్వీట్ ను కూడా బ్రాహ్మణి రీట్వీట్ చేశారు.

Here's Lokesh Nara Tweet

Here's Raghavendra rao Tweet

Here's Jr NTR  Tweet

Here's Chiranjeevi Konidela Tweet

అందరికీ ఆయన బాలయ్య. నా ఒక్కడికీ ఆయన ముద్దుల మావయ్య. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా తనను నమ్ముకున్న వారికి అండగా నిలిచే కథానాయకుడు ఆయన. బాలా మావయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు, షష్టిపూర్తి మహోత్సవ అభినందనలు' అని టీడీపీ నేత లోకేశ్ ట్వీట్ చేశారు.