Tollywood supremos meet with Talasani | Photo: Twitter

Hyderabad, june 8: కోవిడ్ 19 లాక్‌డౌన్ (COVID-19 Lockdown) కార‌ణంగా వాయిదా ప‌డ్డ‌ సినిమా షూటింగ్స్ కు తెలంగాణ ప్ర‌భుత్వం (TS Govt) ఎట్ట‌కేల‌కు అనుమ‌తులు ఇచ్చింది. కోవిడ్ 19 మార్గదర్శకాలు, లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగులు (Film Shootings in TS) కొనసాగించుకోవ‌చ్చ‌ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్ల‌డించారు. దీనికి సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ (Telangana CM KCR) సోమవారం సంతకం చేశారు. పరిమిత సిబ్బందితో, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించుకోవచ్చని, షూటింగులు పూర్తయిన వాటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వెంటనే నిర్వహించుకోవచ్చని కేసీఆర్ స్పష్టం చేశారు. జూన్ నుంచి సినిమా షూటింగ్స్ జరుపుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం కేసీఆర్, విధివిధానాలు రూపొందించాలని ఆధికారులకు ఆదేశాలు, సినిమా హాళ్లను తిరిగి తెరవడంపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని వెల్లడి

ఈ నిర్ణయంతో రెండు నెల‌ల త‌ర్వాత టాలీవుడ్‌లో మళ్లీ షూటింగ్‌ల సంద‌డి నెల‌కొన‌నుంది. అయితే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్ర‌కారం థియేటర్లను ప్రారభించడానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ధియేటర్లు మూసివేత కంటిన్యూ అవుతుందని తెలిపింది. సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి సినిమా, టీవీ షూటింగులకు, పోస్టు ప్రొడక్షన్ పనులకు, సినిమా థియేటర్లు తెరవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన విషయం విదితమే. వర్మ 'కరోనా వైరస్‌' ట్రైలర్, జగన్,కేసీఆర్‌ పారాసిటామాల్, బ్లీచింగ్ పౌడర్ డైలాగ్స్ ట్రైలర్‌కి హైలైట్‌, యూట్యూబ్‌లో ట్రెండింగ్ ఇదే

దీనికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, అందుక‌వ‌స‌ర‌మ‌య్యే విధి విధానాలు రూపొందిచాలని అధికారులను ఆదేశించారు. దీంతో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సినీరంగ ప్రముఖులు సమావేశమై విధివిధానాల ముసాయిదా రూపొందించారు.

ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి, పరిమిత సిబ్బందితో షూటింగులు, పోస్టు ప్రొడక్షన్ పనులు నిర్వహించుకుంటామని సినీ రంగ ప్రముఖులు హామీ ఇవ్వడంతో సీఎం కేసీఆర్ షూటింగ్స్‌కు అనుమతి ఇస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.