Hyd, Aug 10: నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ఓటీటీలో ప్రసారం అవుతున్న షో అన్‌స్టాపబుల్. ఇప్పటివరకు మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో టాప్ రేటింగ్‌లో ఉంది. ప్రభాస్ , పవన్ కళ్యాణ్, ఏపీ సీఎం చంద్రబాబు,లోకేష్ వంటి ప్రముఖులు రాగా అద్భుత స్పందన వచ్చింది. ప్రతీ సీజన్‌కు రెట్టింపు రేటింగ్ రావడంతో తాజాగా నాలుగో సీజన్‌ను త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఇక గత మూడు సీజన్‌లకు భిన్నంగా ఈసారి నాలుగో సీజన్ ఉండనుందట. ఇక నాలుగోసీజన్ తొలి ఎపిసోడ్‌కు గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి రానున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి చిరంజీవి అన్‌స్టాపబుల్‌కు వస్తున్నారని గత రెండు సీజన్లలో ప్రచారం జరిగినా అలాంటిదేమి జరగలేదు. కానీ తాజాగా మాత్రం చిరు రావడం పక్కా అని సమాచారం. మీడియా రంగంలోకి మెగా బ్రదర్ నాగబాబు.. ‘ఎన్’ మీడియా ఎంటర్ టైన్‌మెంట్ పేరుతో యూట్యూబ్ ఛానల్
ఒకవేళ చిరంజీవి అన్‌స్టాపబుల్ షోకి వస్తే మాత్రం అభిమానులకు ఖచ్చితంగా కనులపండగే. ఎందుకంటే చిరు - బాలయ్య కలిసి ఒకే వేదికపై కనిపిస్తే ఆ కిక్కే వేరు. అసలే కొంతకాలంగా టాలీవుడ్ అగ్రహీరోల మధ్య గ్యాప్ ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చిరు రాక ఖచ్చితంగా కొత్త ఒరవడిని సృష్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక చిరుతో పాటు కింగ్ నాగార్జున కూడా అన్‌స్టాపబుల్ షోలో పాల్గొంటారని తెలుస్తోంది. దీనికి సంబంధించి అఫిషియల్ ప్రకటన రావాల్సి ఉంది.