Newdelhi, May 12: పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పై కేసు నమోదైంది. స్నేహితుడి తరుఫున ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్న క్రమంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ కేసు (Police Case) నమోదైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. శిల్పా రవిచంద్రారెడ్డి, అల్లు అర్జున్ మధ్య మంచి స్నేహం ఉంది. దీంతో శనివారం తన మిత్రుడు శిల్పా రవి కోసం అల్లు అర్జున్ సతీసమేతంగా నంద్యాలలో అడుగుపెట్టారు. శిల్పా రవి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ ను చూసేందుకు వేలాదిగా జనం తరలివచ్చారు.
హీరో అల్లు అర్జున్‌పై కేసు నమోదు
నంద్యాలలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ఎలాంటి అనుమతి లేకుండా వేలాది మందిని జన సమికరణం చేశాడని స్పెషల్ డిప్యూటీ తహశీల్దార్ పి.రామచంద్రరావు ఫిర్యాదు చేశారు.
దీంతో నంద్యాల టూటౌన్ పోలీస్ స్టేషన్లో హీరో అల్లు అర్జున్‌పై, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి… pic.twitter.com/zd1YPMFoBi
— Telugu Scribe (@TeluguScribe) May 11, 2024
ఆ కారణంతో..
తమ అనుమతి లేకుండా భారీగా జన సమీకరణ చేశారంటూ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు సెక్షన్ 188 కింద అల్లు అర్జున్, వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిలపై కేసు నమోదు చేశారు.