Hyderabad, Oct 8: టాలీవుడ్ (Tollywood) లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా మారిన హీరో ప్రభాస్ (Hero Prabhas) పెళ్లి ఎప్పుడంటూ చర్చ జరుగడం ఇప్పటిది కాదు. ఇప్పుడు దానిపై మరింత క్లారిటీ వచ్చేసింది. ప్రభాస్ పెళ్లి రోజు త్వరలోనే రానుందని ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి చెప్పారు. నవరాత్రుల నేపథ్యంలో బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న శ్యామల మీడియాతో మాట్లాడారు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడంటూ మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇచ్చారు. అందరూ ఎదురుచూస్తున్న ఆ రోజు త్వరలోనే రానుందని పేర్కొన్నారు.
Here's Video:
ప్రభాస్‌కు త్వరలోనే పెళ్లి అవుతుంది: శ్యామలా దేవి
విజయవాడ కనక దుర్గమ్మను హీరో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి దర్శించుకున్నారు. ప్రతి ఒక్కరిపై అమ్మవారి ఆశీస్సులుండాలని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు. ప్రభాస్ పెళ్లి గురించి ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారని ఓ రిపోర్టర్ ప్రశ్నించారు.… pic.twitter.com/d8xM3RrMWJ
— ChotaNews (@ChotaNewsTelugu) October 7, 2024
కృష్ణంరాజు దీవెనలు కూడా
ఇంకా ఆమె మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతోపాటు పై నుంచి కృష్ణంరాజు దీవెనలు కూడా ప్రభాస్ పై ఎప్పటికీ ఉంటాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. తమ అభిమాన హీరో పెళ్లి త్వరలో జరుగబోతుందని తెలియడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.