రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మైథలాజికల్ డ్రామా ‘ఆదిపురుష్’. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటించారు. రావణాసురుడి పాత్రను సైఫ్ అలీఖాన్ పోషించాడు. తాజాగా ఈ చిత్రం వాయిదా పడింది. మొదట వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను థియేటర్లోకి తీసుకువస్తున్నట్లు చిత్ర బృందం గతంలో అధికారిక ప్రకటన ఇచ్చింది. కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని వాయిదా (Adipurush officially postponed) వేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ విషయాన్ని డైరెక్టర్ ఓంరౌత్ తెలియజేస్తూ సోమవారం ఉదయం ఆయన ఓ ప్రకటన (new date declared ) విడుదల చేశారు. ‘‘ఆదిపురుష్ అనేది సినిమా కాదు. శ్రీరాముడిపై భక్తి, సంస్కృతి, చరిత్రలపై మనకున్న నిబద్ధతకు నిదర్శనం. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించడం కోసం మరికొంత సమయం తీసుకోవాల్సి వస్తోంది. వచ్చే ఏడాది జూన్ 16న ‘ఆదిపురుష్’ను విడుదల (Adipurush New Release Date) చేయనున్నాం. భారతదేశం గర్వించే సినిమాగా దీన్ని మీ ముందుకు తీసుకురావాలని మేం నిర్ణయించుకున్నాం. మీ ప్రేమాభిమానాలే మమ్మల్ని నడిపిస్తున్నాయి’’ అంటూ ఆయన హిందీలో ట్వీట్ చేశాడు.
రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌పై కేసు నమోదు.. ‘ఓ పరి’ ఆల్బమ్ వివాదంలో కేసు నమోదు.. అసలు ఏమైంది?
ఇక ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్న ప్రభాస్ ఆదిపురుష్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమాను ఇటీవల వివాదాలను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని రావణాసురుడు, హనుమాన్ పాత్రలను చూపించిన విధానంపై సర్వత్రా వ్యతిరేకత వచ్చింది. ఇదిలా ఉంటే