Salaar-Tinnu Anand: సలార్ టీజర్‌లో తాతను గుర్తు పట్టారా, తెలుగులో టీనూ ఆనంద్ చేసిన సినిమాల లిస్ట్ ఇదిగో..
Salaar-Tinnu Anand (Photo-Salaar Teaser)

రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ టీజర్ వచ్చేసింది. డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా టీజర్ దుమ్మురేపుతోంది. యూట్యూబ్ లో భారీ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ టీజర్ లో ప్రభాస్ ని 10 సెకన్లకు మించి చూపించలేదు.అయితే ఇదే టీజర్‌లో 'సలార్'కి ఎలివేషన్స్ ఇచ్చిన తాత బాగా హైలెట్ అయ్యాడు. ఇంతకీ ఈ నటుడు ఎవరంటూ గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. ఇంతకీ అతడి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

'సింహం, చిరుత, పులి, ఏనుగు చాలా డేంజర్.. కానీ జురాసిక్ పార్క్‌లో కాదు.. ఎందుకంటే అక్కడ ఉండేది డైనోసార్' అనే డైలాగ్ తో 'సలార్' టీజర్ లో తాతగా కనిపించిన నటుడు టీనూ ఆనంద్. రెబల్ స్టార్ ప్రభాస్ తో సాహో తర్వాత అతనికి ఇది రెండో సినిమా. తెలుగులో టీనూ ఆనంద్ మొదటగా బాలకృష్ణ 'ఆదిత్య 369' మూవీలో నటించాడు. టైం మిషన్ తయారీకర్తగా నటించాడు. ఆ తర్వాత చిరంజీవి 'అంజి'లోనూ భాటియా అనే పాత్రలో విలనిజం పండించాడు.

ప్రభాస్ ఫ్యాన్స్‌ వెయిటింగ్‌కు తెర, టీజర్‌ రిలీజ్ చేసిన సలార్‌ టీమ్‌, రెండు పార్టులుగా మూవీ, ఫస్ట్ పార్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

ఇక గతేడాది వచ్చిన 'సీతారామమ్'లో ఆనంద్ మెహతా అనే పాత్రలో కనిపించింది టీనూనే. టీనూ ఫ్యామిలీలో టీనూతో పాటు దాదాపు అందరూ ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఈయన మేనల్లుడు సిద్దార్థ్ ఆనంద్ ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. 'పఠాన్', 'వార్', 'బ్యాంగ్ బ్యాంగ్' చిత్రాలతో బాలీవుడ్ కి బ్లాక్ బస్టర్స్ హిట్స్ ఇచ్చింది ఇతడే. టీనూ ఆనంద్ లో నటుడితో పాటు రైటర్, డైరెక్టర్, ప్రొడ్యుసర్ పాత్రలు కూడా పోషించాడు. గతంలో హిందీ సినిమాల్లో ఎక్కువగా కనిపించాడు.