Mumbai, March 20: బాలీవుడ్ (Bollywood) సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) కు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూను ప్రస్తావించిన నిందితుడు.. సల్మాన్‌ను చంపేస్తామని హెచ్చరిస్తూ ఆయన సన్నిహితుడు ఒకరికి ఈమెయిల్ పంపాడు. అంతేకాదు, సల్మాన్‌ను చంపడమే తన జీవిత లక్ష్యమని కూడా అందులో పేర్కొనడం గమనార్హం. సల్మాన్ టీం నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్, ఈమెయిల్ పంపిన రోహిత్ గార్గ్ పై కేసు నమోదు చేశారు. సల్మాన్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
Salman Khan Gets Threat Mail, Files Case Against Gangster Lawrence Bishnoi https://t.co/jimq4u8SFG pic.twitter.com/uQOHBtLLiN
— NDTV (@ndtv) March 19, 2023
ఈమెయిల్ లో ఏం ఉందంటే??
‘‘మీ బాస్ (సల్మాన్ ఖాన్)తో గోల్డ్ బ్రార్ మాట్లాడాలనుకుంటున్నారు. బిష్ణోయ్ ఇంటర్వ్యూను ఆయన చూడాలి. ఒకవేళ చూడకుంటే కనుక చూసేలా చేయండి. ఈ విషయాన్ని ఇంతటితో ముగించాలనుకుంటే సల్మాన్ (గోల్డీబ్రార్‌తో) మాట్లాడాలి. ఆయనతో ముఖాముఖిగా మాట్లాడాలనుకుంటే కనుక మాకు చెప్పండి. ఈసారి మీకు సకాలంలో సమాచారం ఇచ్చాం. వచ్చేసారి మాత్రం షాక్ అవుతారు’’ అని ఆ ఈమెయిల్‌లో హెచ్చరిక జారీ చేశారు.